హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Library: అది విజ్ఞానాన్ని పంచే లైబ్రరీ మాత్రమే కాదు.. ఆహ్లాదం పంచే అద్భుత వనంలో ఉన్న ఫీలింగ్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

Library: అది విజ్ఞానాన్ని పంచే లైబ్రరీ మాత్రమే కాదు.. ఆహ్లాదం పంచే అద్భుత వనంలో ఉన్న ఫీలింగ్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

ఆ లైబ్రెరీకి వెళ్తే చల్లటి వనంలోకి వెళ్లినట్టే

ఆ లైబ్రెరీకి వెళ్తే చల్లటి వనంలోకి వెళ్లినట్టే

Librery: చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తరువాత పుస్తాకాలు చదవడం.. లైబ్రెరీలకు వెళ్లడం తగ్గిపోయింది. అయినా ఇప్పటికే అక్కడక్కడా కొన్న గ్రంథాలయాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అందులో ఇది చాలా ప్రత్యేకమైంది.. కేవలం విజ్ఞానాన్ని పంచడమే కాదు.. ఆహ్వాదాన్ని కూడా అందిస్తుంది.. ఇంకా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా..?

ఇంకా చదవండి ...

S jagadesh, visakhaptnam, News 18.

Librery: ఆ గ్రంథాలయం (Library)లోఅడుగుపెడితే పకృతి లో అడుగుపెట్టినట్లే. అందమైన పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతాయి. విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు  విద్యార్ధులను (Good Books for Students) ఆకర్షిస్తాయి. చదువుకునేందుకూ ప్రేరిపిస్తాయి. పోటీ పరీక్షల్లో విజేతలుగా (For comparative Exam Winners) నిలిపేందుకు దోహద పడుతాయి. వేసవి తాపానికి తట్టుకునేలా ఏసిలు (Acs in Library) కూడా ఏర్పాటు చేశారు. ఇంత సౌకర్యవంతమైన గ్రంథాలయం వైజాగ్ లోని ఆర్టీసీ కాంప్లెక్స్ (Vizag RTC Complex) లోనే ఉంది. విశాఖపట్నం అర్.టి.సి కాంప్లెక్స్ నుండి 500 మీటర్ల దూరంలో, గురుద్వారా (Gurdwara) వెళ్ళే మార్గంలో ఇంతటి సౌకర్యవతంగా వుండే పౌర గ్రంథాలయం వుంది.

ఈ పౌర గ్రంథాలయం 2003లో ఏర్పాటైన గ్రంథాలయం. దినదినాభివృద్ధి చెందుతూ విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఒకసారి అక్కడ అడుగు పెడితే పదేపదే రావాలనిపించే వాతావరణం గ్రంథాలయం సొంతం. ఇది ఇంత అద్భుతంగా ఉండడానికి కారణం.. ప్రొఫెసర్ సర్వేశ్వరరావు కృషి దాగిఉంది. 2003లో కొంతమంది సభ్యులు సొసైటీగా ఏర్పాటు అయ్యి పట్టువదలని విక్రమార్కుల్లా గ్రంథాలయానికి ప్రభుత్వ స్థల సమీకరణ, నూతన భవన నిర్మాణానికి చేసిన ప్రయాత్నాలు ఫలించాయి.

ఇదీ చదవండి : పెద్దమనసు చాటుకున్న బాలయ్య.. అనారోగ్యం బారిన పడిన అభిమానికి వీడియో కాల్? ఏం మాట్లాడారో చూడండి.?

అప్పటి నుంచి నేటి వరకు.. ఎంతో మంది విద్యార్ధులను పోటీ పరీక్షలకు చదువుకునే విధంగా సేవలుఅందిస్తోంది. ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం 63 వేల పుస్తకాలు ఏర్పాటు చేశారు. పరిశుభ్రతతో బల్లలు, కుర్చీలు సమకూర్చారు. ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు అవసరమైన విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, బాలసాహిత్య పుస్తకాలు, ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు సమకూర్చారు. సొంతపుస్తకాలు తెచ్చుకొనిచదువుకునే విభాగం, కంప్యూటర్ విభాగం, రామాయణ మహాభారత విభాగం, గాంధీయానం విభాగం , న్యూస్ పేపర్లు.. మ్యాగ్ జైన్లు, వార, మాస, పక్ష, పత్రికా విభాగాలు ఉన్నాయి.

ఇదీ చదవండి : అసలే అసంతృప్తిలో మంత్రి.. ఇప్పుడు బొత్సను ఇరుకున పడేసిన సీఎం జగన్..డారో చూడండి.?

పెద్దలకి, పిల్లలకి అందరికీ విద్య అందుబాటులో ఉంచుతున్నారు. భవనం ముందుభాగం, ప్రహరిపక్కన రకరకాల పచ్చని మొక్కలు విద్యార్థులను, పెద్దలను ఆహ్వానం పలుకుతాయి. ఇక్కడకు వస్తే పుస్తకమే ప్రపంచమవుతుంది. అన్ని దిన పత్రికలతో పాటు విలువైనగ్రంథాలు, సాహిత్య, పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉండే పుస్తకాలన్నీ ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నాయి.


ఇదీ చదవండి : ఇంత అమానుషమా.. భర్త చనిపోయిన ధు:ఖంలో ఉంటే.. శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం

కోచింగ్ కు వెళ్లలేని పేదలకు ఇది ఉపయోగపడుతుంది. లైబ్రరీకి వచ్చే విద్యార్థులకి మంచి పోటీ పరీక్షల పుస్తకాల గురించి, సందేహాలు చెప్పుతూ.. గ్రంథాలయ అధికారులు చదవమని ప్రోత్సహిస్తారు. ఒకప్పడు విద్యార్ధులకి గ్రంథాలయానికి రావాలంటే ఇబ్బందిగా ఉండేది. ఏ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో తెలిసేది కాదు. ఇప్పుడు లైబ్రరీ పరిస్థితి పూర్తిగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించారు. ఏ పోటి పరీక్షకు సంబంధించిన పుస్తకాలైనా ఇక్కడ ఉంటున్నాయి. లేని  లేని పుస్తకాలను ఆర్డర్ పెట్టి  మరి తెప్పిస్తారు. వారిసేవలు వి ద్యార్థులు వినియోగించుకోవాలని గ్రంధాలయ అధికారులు కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Library, Visakhapatnam

ఉత్తమ కథలు