తిరుమల శ్రీవారి గోసంరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళం

9 ఏళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించామని.. వేంకటేశ్వరుడి దయ వల్ల తమ కంపెనీ బాగా నడుస్తోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారికి విరాళం ఇచ్చినట్లు తెలిపారు.

news18-telugu
Updated: January 7, 2020, 6:12 PM IST
తిరుమల శ్రీవారి గోసంరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళం
శ్రీవారి గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
  • Share this:
తిరుమల శ్రీవారి గోసంరక్షణ ట్రస్టుకు రూ.1.10 కోట్లు విరాళంగా అందింది. బెంగళూరుకు చెందిన చెందిన అమరనాథ్‌ చౌదరి అనే భక్తుడు ఈ విరాళం ఇచ్చారు. సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న అమరనాథ్ కుటుంబ సభ్యులు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి డీడీలను అందజేశారు. ఆ మొత్తాన్ని గో సంరక్షణకు ఉపయోగించాలని కోరారు అమర్‌నాథ్. 9 ఏళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించామని.. వేంకటేశ్వరుడి దయ వల్ల తమ కంపెనీ బాగా నడుస్తోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారికి విరాళం ఇచ్చినట్లు తెలిపారు. స్వామి వారికి అభిషేక పదార్థాలన్ని గో సంరక్షణ ట్రస్టు నుంచే వస్తాయని.. అందుకే ట్రస్టుకు విరాళం ఇచ్చామని వెల్లడించారు అమర్‌నాథ్.
Published by: Shiva Kumar Addula
First published: January 7, 2020, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading