హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bengal Tiger: బాబోయ్ బెంగాల్ టైగర్.. మళ్లీ వచ్చింది.. గేదెలపై దాడి.. ఆ ప్రాంతంలో భయం భయం..

Bengal Tiger: బాబోయ్ బెంగాల్ టైగర్.. మళ్లీ వచ్చింది.. గేదెలపై దాడి.. ఆ ప్రాంతంలో భయం భయం..

కాకినాడలో కెమెరాకు చిక్కిన పులి

కాకినాడలో కెమెరాకు చిక్కిన పులి

Bengal Tiger: అది సాధారణ పులిలా లేదు.. ఎందుకంటే నెల రోజులు దాటుతున్నా.. బోనుకి చిక్కడం లేదు. అధికారులు ఎన్ని వ్యూహాలు వేసినా.. అన్నింటినీ చిత్తు చేస్తోంది. చిక్కింది అనుకుంటే చేజారిపోతోంది. తాజాగా మరోసారిర గేదెలపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతల ప్రజలంతా భయం భయంతో బతుకుతున్నారు.

ఇంకా చదవండి ...

Bengal Tiger:  ఒకటి రెండు కాదు.. 30 రోజులు దాటింది. అయినా ఆ బెంగాల్ టైగర్ బోనుకు చిక్కడం లేదు.  కాకినాడ జిల్లా (Kakinada District)లో పులి (Tiger) కోసం దాదాపుగా నెలరోజులు దాటినా.. ఏ మాత్ర ఫలిత ఆశాజనకంగా కనిపించడం లేదు.  పరిసర ప్రాంతాల వారికి కంటిమీదు కునుకు లేకుండా చేస్తోంది. అధికారులను పరుగులు తీస్తోంది. వారి వ్యూహాలను అన్నింటినీ తిప్పికొడుతోంది. అటవీశాఖ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరుగులు పెట్టిస్తోంది. చిక్కినట్టే చిక్కి చేజారిపోతోంది.  దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరా (CC Cemara) లో రికార్డు అయ్యాయి. ఎక్కడి నుంచో వచ్చింది.. కానీ కోనసీమలో తిష్ట వేసింది.  ఆ పులిని బంధించేందుకు ఎన్ని ఎత్తులు వేసినా అన్నింటినీ చిత్తు చేస్తోంది.

కాకినాడలో కాలుమోపిన పులి కదలనంటూ సవాల్ విసురుతోంది.. దమ్ముంటే నన్ను టచ్ చేసి చూడండి అంటూ పంజా విసురుతోంది. ఎన్ని ఎత్తుగడలు వేసినా, చిక్కనంటూ.. అధికారుల వ్యూహాలను పటాపంచలుచేస్తోంది. అటవీశాఖ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరుగులు పెట్టిస్తున్న బెంగాల్ టైగర్.. మరోసారి పశువులపై పంజా విసిరింది. దీంతో అసలు ఆ పులిని ఏం చేయాలో అర్థం అవ్వడం లేదంటున్నారు అధికారులు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చిక్కకపోవడంతో.. కొత్తు వ్యూహాలతో ముందుకువెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ఒక ఆలోచన చేస్తే.. అది పది ఎత్తులు వేస్తోంది..

 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరం పరిసరాల్లో పులి ఇవాళ తిష్ట వేసినట్టు తెలుస్తోంది. పశువులపై దాడికి పాల్పడిన పెద్ద పులి.. అక్కడినుంచి పరారైంది. గేదె, లేగ దూడ మెడపై దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే.. పెద్దపులిని చూసిన పశువులు అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాయి. కానీ ఓ గేదె, దూడ మాత్రం పులి పంజా నుంచి తప్పించుకోలేక గాయాల పాలయ్యాయి.

ఇదీ చదవండి : సలామ్ రాఖీ.. పోలీసు డాగ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియులు.. ఎంత సేవ చేసిందంటే?

వెంటనే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకొని పెద్ద పులి జాడ కోసం వెతుకుతున్నారు. కాగా.. దాదాపు నెలరోజులుగా అధికారుల చేతికి చిక్కినట్టే చిక్కి, చిక్కకుండా పోతోన్న పులి కోసం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా.. పులి భయంతో పరిసర ప్రాంతాల జనం నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెం సహా 11 గ్రామాల పరిసరాల్లో పులి అడుగుజాడలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎటువైపు నుంచి పులి పంజా విసురుతుందో తెలియక జనం హడలిపోతున్నారు. ఈ ప్రాంతాల్లో బోనుల్లో మాంసాన్ని ఎరగావేసినా వచ్చినట్టే వచ్చి అడుగు దూరంలోనుంచి బోన్లను తప్పించుకొని పారిపోతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kakinada, Tiger, Tiger Attack

ఉత్తమ కథలు