Andhra Pradesh : బీసీ కుల‌ గణ‌న‌పై పెరుగుతున్న‌ డిమాండ్లు.. ఎందుకోసం?

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయబోతున్నారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఆరుసార్లు తీసిన జనాభా గణనలో కులాల వారీగా లెక్కలు తీయలేదు. కానీ, ఈసారి కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కార‌ణం ఏంటీ ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నారు.

 • Share this:
  దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయబోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆరుసార్లు తీసిన జనాభా గణనలో కులాల వారీగా లెక్కలు తీయలేదు. కానీ, ఈసారి కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అన్ని పార్టీలు, బీసీ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డిమాండ్ చేస్తున్నాయి.
  ఎందుకోసం బీసీ గ‌ణ‌న అవ‌స‌రం.. ఈ రోజు ప్ర‌ధాని మోదీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌తిప‌క్ష‌నేత నారా చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. బీసీ జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని ఆయ‌న లేఖ‌లో ప్ర‌ధానమంత్రి మోదీ (Prime Minister Modi) ని కోరారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో ఆయా వ‌ర్గాలు వెనుక‌బ‌డి ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని, బీసీ జనగణనపై తమ ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చంద్రబాబు గుర్తు చేశారు. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆయా వర్గాలు ఇంకా వెనకబడే ఉంటున్నాయని ఆ లేఖలో తెలిపారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని అభిప్రాయ‌ప‌డ్డారు.

  ఎందుకు గ‌ణ‌న‌..

  జ‌నాభా ప్రాతిప‌దిన రిజ‌ర్వేషన్ (Reservation) ఫ‌లాలు అందాల‌నేది ప‌లు బీసీ సంఘాల వాద‌న. బీసీ గ‌ణ‌న చేయ‌డం వ‌ల్ల ఎంత‌శాతం ఉన్నారు అనే వివ‌రాలు తెలిసి వారి ఆర్థిక స్థితిగ‌తుల ఆధారంగా సంక్షేమ ఫ‌లాలు అందించడం వీల‌వుతుంద‌ని బీసీ సంఘాలు కోరుతున్నాయి.

  Andhra Pradesh : బ‌డి ఎంపిక వారి ఇష్టం.. ఎయిడెడ్ విద్యార్థుల‌కు ప్ర‌భుత్వ అవకాశం  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీసీ జనాభా లెక్కలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జనగణనలో కులాల వారీ లెక్కలు తీయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం 2006లో కేంద్రానికి లేఖ రాసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా కులాల వారిగా జనాభా లెక్కలు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దాదాపు అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదు.

  స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు, ఇతర రిజర్వేషన్లు, ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బీసీ జనాభా లెక్కలు తీశాయి. 1984లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా జనాభా లెక్కలు తీసింది.

  Andhra Pradesh : వారి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ‌ ఉద్యోగం.. ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం


  ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించగా బీసీ జనాభా 52 శాతం ఉన్నట్టు తేలింది.

  2010లో కర్నాటక (Karnataka) ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు, జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన అమలు చేస్తారని, ఆ రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంతే కాకుండా జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచవచ్చని తీర్పు చెప్పింది. 1996లో బీసీ జనాభా లెక్కలు తీసేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో కేసు వేయగా బీసీ జనాభా లెక్కలు తీయాలని ఆదేశించింది. ఇలా వందల కేసుల్లో సుప్రీంకోర్టు-హైకోర్టులు బీసీ జనాభా లెక్కలు తీయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేద‌నే అభిప్రాయం ఉంది.
  Published by:Sharath Chandra
  First published: