ఏపీలో తగ్గనున్న బార్లు... త్వరలోనే నిర్ణయం ?

ఏపీలో మద్యం షాపులను తగ్గించినట్టుగానే బార్ల సంఖ్యను కూడా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 16, 2019, 1:22 PM IST
ఏపీలో తగ్గనున్న బార్లు... త్వరలోనే నిర్ణయం ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పటికే కొత్త మద్యం పాలసీ ద్వారా బెల్టు షాపులను రద్దు చేయడంతో పాటు మద్యం షాపుల సంఖ్యను తగ్గించిన ఏపీ ప్రభుత్వం... బార్లను తగ్గించే అంశంపై కూడా దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త బార్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఏపీ సర్కార్ తీసుకున్న కొత్త విధానం కారణంగా బార్ల సంఖ్య 840 నుంచి 588కి తగ్గే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్స్‌లను రద్దు చేయాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం... వచ్చే నెలలో కొత్త వాటి కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.

డిసెంబర్ చివరినాటికి లైసెన్సుల ప్రక్రియ ముగించి కొత్త సంవత్సరంలో కొత్త బార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బార్లకు 2017లో ఐదేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులను గత ప్రభుత్వం జారీ చేసింది. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న బార్లకు మరో మూడేళ్ల కాలపరిమితి ఉంది. దీంతో బార్ల యజమానులు తమ లైసెన్సులు రద్దుచేయడంపై కోర్టుకు వెళితే ఎదురయ్యే పరిణామాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ అంశంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక బార్ల సంఖ్యను తగ్గించడంతో పాటు వాటి పనివేళలు కూడా తగ్గించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>