హోమ్ /వార్తలు /andhra-pradesh /

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?

AP Assembly Election 2019 : రాజకీయాల్లో ఎక్కువ స్థానాలు గెలవడం ఎంత ముఖ్యమో... అధికారంలోకి వచ్చేందుకు తెలివైన ఎత్తుగడలు వెయ్యడం కూడా అంతే ముఖ్యం.

AP Assembly Election 2019 : రాజకీయాల్లో ఎక్కువ స్థానాలు గెలవడం ఎంత ముఖ్యమో... అధికారంలోకి వచ్చేందుకు తెలివైన ఎత్తుగడలు వెయ్యడం కూడా అంతే ముఖ్యం.

AP Assembly Election 2019 : రాజకీయాల్లో ఎక్కువ స్థానాలు గెలవడం ఎంత ముఖ్యమో... అధికారంలోకి వచ్చేందుకు తెలివైన ఎత్తుగడలు వెయ్యడం కూడా అంతే ముఖ్యం.

  ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ వేటికవే అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నా... తెరవెనక మాత్రం మెజార్టీ సీట్లు రాకపోతే ఏంటి పరిస్థితి అన్న అంశంపై తెగ మదనపడుతున్నాయి. ఏం చేసైనా సరే, అధికారంలోకి రావాలి అనుకుంటూ... ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసినట్లు తెలిసింది. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, తెరవెనక కొందరు సీనియర్లతో ఈ మంత్రాంగం నడిపిస్తున్నాయని తెలిసింది. 175 సీట్లు ఉన్న ఏపీ అసెంబ్లీలో అధికారంలోకి రావాలంటే మేజిక్ ఫిగర్ 88. ప్రస్తుతం రెండు పార్టీలూ వేటికవే 100కు పైగా స్థానాలు గెలుస్తామని చెబుతున్నాయి. లోలోపల మాత్రం 60-70 స్థానాలకు మించి రాకపోతే ఏంటి పరిస్థితి అన్న అంశంపై చర్చిస్తున్నాయి.

  ఆల్రెడీ అధికారంలో ఉన్న టీడీపీ... ఐదేళ్ల పాలనా కాలంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంది. అలా పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని వైసీపీ పోరాడినా ఫలితం లేకపోయింది. స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండిపోగా... మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ అదే ఆపరేషన్ చేపట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మే 23న ఫలితాలు వచ్చాక, అధికారాన్ని చేపట్టేందుకు సరిపడా స్థానాలు దక్కకపోతే... అప్పటికప్పుడు ఏ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలనైనా బేరం పెట్టి కొనేందుకు ఎంత డబ్బు కావాలో, ఏ రేటుకి ఎమ్మెల్యేలు దొరుకుతారో ఆ లెక్కలపై టీడీపీ సమాలోచనలు జరుపుతోందన్న ప్రచారం సాగుతోంది.

  వైసీపీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు 23 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకున్న ఆ పార్టీ ఈసారి తమ ఎమ్మెల్యేలను కట్టడి చేస్తూనే... ప్రత్యర్థి పార్టీల నుంచీ ఎవరెవరు తమ పార్టీలోకి పిరాయిస్తారో దృష్టి పెడుతున్నట్లు తెలిసింది. ఐతే... టీడీపీ లాగా పిరాయింపులకు ప్రోత్సహించకుండా... ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ ఉప ఎన్నికలు జరిపించి, తమ పార్టీ తరపున పోటీ చేయించి, గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

  ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు ? : ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్ల దాకా ఉంటోందని తెలుస్తోంది. ఇంత ఎక్కువ రేటు ఉండటానికి ప్రత్యేక కారణం ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కో అభ్యర్థీ దాదాపు రూ.30 కోట్ల దాకా ఖర్చు పెట్టారనీ, ఇప్పుడు ఆ డబ్బును రాబట్టుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ టైంలో డిమాండ్ చేయబోతున్నారని తెలిసింది.

  కేబినెట్ బెర్తులు కూడా : ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి అన్నట్లు... వివిధ పార్టీల ఎమ్మెల్యేలు కూడా... తమకు డిమాండ్ పెరగడంతో... మీ పార్టీలోకి వస్తే డబ్బుతో పాటూ మంత్రి పదవి కూడా ఇస్తారా అని డిమాండ్ చేస్తున్నారట. ఇదివరకు టీడీపీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ... ఆఫర్ ఇస్తారా అని అడుగుతున్నారట ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు. వైసీపీ మాత్రం మంత్రి పదవులపై ఇప్పుడే చెప్పలేమనీ, ఫలితాలు వచ్చిన తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుందని అసలు విషయాన్ని దాట వేస్తోందని సమాచారం.

  నిజానికి టీడీపీ, వైసీపీలో ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలలో సీనియర్లంతా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఉన్న పదవులు వాళ్లకు ఇవ్వడానికే సరిపోవు. అందువల్ల పిరాయింపుల ద్వారా వచ్చే ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పాలక మండళ్ల డైరెక్టర్లు, నామినేటెడ్ పోస్టులు వంటి పదవులు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిసింది. మొత్తానికి ఎన్నికల ఫలితాలు రావడానికి మరో 10 రోజులు ఉండగా... ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుందని చెప్పొచ్చు.

  ఇవి కూడా చదవండి :

  జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?

  నేటితో పరిషత్ ప్రచారం సమాప్తం... ఎల్లుండి చివరి దశ పోలింగ్

  బ్యాలెన్స్ ఫార్ములాతో లగడపాటి సర్వే... వైసీపీ షాక్ ఇస్తుందా...?

  రెస్ట్ లేని జగన్... లోటస్‌పాండ్‌కి నేతల క్యూ... సీనియర్ల సలహాలు...

  First published:

  ఉత్తమ కథలు