హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పసుపు-కుంకుమ నిధులకు బ్యాంకుల బ్రేకులు... ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పాల్సిందేనా...

పసుపు-కుంకుమ నిధులకు బ్యాంకుల బ్రేకులు... ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పాల్సిందేనా...

AP Assemblye Elections 2019 : ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆశించిన ఫలితం రాకుండా పోతోందా? బ్యాంకుల నిర్ణయాలు టీడీపీకి షాకిస్తున్నాయా?

AP Assemblye Elections 2019 : ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆశించిన ఫలితం రాకుండా పోతోందా? బ్యాంకుల నిర్ణయాలు టీడీపీకి షాకిస్తున్నాయా?

AP Assemblye Elections 2019 : ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆశించిన ఫలితం రాకుండా పోతోందా? బ్యాంకుల నిర్ణయాలు టీడీపీకి షాకిస్తున్నాయా?

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్ననే పసుపు-కుంకుమ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు ఇచ్చే రూ.10,000లో... మూడో విడతగా చెల్లించాల్సిన రూ.4,000 చొప్పున సాయాన్ని విడుదల చేసింది. ఇందుకు సంబంధించి రూ.3,900 కోట్లు రిలీజ్ చేసింది. డ్వాక్రా మహిళలకు రూ.10వేలు సాయం ప్రకటించిన ప్రభుత్వం... మొదటి విడతగా రూ.2,500... రెండో విడతలో రూ.3,500 చొప్పున అందించింది. మూడో విడతగా రూ.4 వేలు సాయానికి సంబంధించిన నిధులను బ్యాంకుల్లో వేసినట్లు తెలిసింది. ఈ పథకానికి కేంద్ర ఎన్నికల సంఘంతోపాటూ... ఢిల్లీ హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... ఇక డ్వాక్రా మహిళలందరికీ సాయం అందిందనీ, వారి ఓట్లన్నీ టీడీపీకే పడతాయని ప్రభుత్వం ఆశించినట్లు తెలిసింది. ఐతే... బ్యాంకుల నిర్ణయాలు టీడీపీకి ఇబ్బంది కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.

  డ్వాక్రా మహిళల్లో చాలా మంది ఆల్రెడీ బ్యాంకుల్లో అప్పులు చేశారు. ఇప్పుడు నిధులు విడుదల కాగానే... బ్యాంకుల ఉద్యోగులు... పాత బాకీల వసూలులో భాగంగా... ఈ నిధులను తీసేసుకుంటున్నారు. అందువల్ల చాలా మంది మహిళలకు పసుపు-కుంకుమ డబ్బులు చేతికి రావట్లేదు. వాళ్లు ఉసూరుమంటూ ఇంటిదారి పడుతున్నారు.

  ఈ విషయంలో బ్యాంకుల ఉద్యోగులు తమ తప్పేమీ లేదంటున్నారు. రూల్స్ ప్రకారం అకౌంట్లలో క్రెడిట్ అయ్యే డబ్బు... ఆటోమేటిక్‌గా పాత బాకీలకు డెబిట్ అవుతుందనీ... దానికి తాము చేసేది ఏమీ లేదని అంటున్నారు. ఏ అప్పూ లేని మహిళలకు నిధులు సక్రమంగానే అందిస్తున్నామని చెబుతున్నారు.

  బ్యాంకర్ల వాదనతో ఏపీ సీఎం చంద్రబాబు ఏకీభవించట్లేదు. పసుపు-కుంకుమ నిధులను పాత బాకీలతో సంబంధం లేకుండా మహిళలకు ఇవ్వాల్సిందే అని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఎవరైనా బ్యాంకు ఉద్యోగి డబ్బులు ఇవ్వకపోతే... చంద్రబాబుకి కంప్లైంట్ ఇస్తామని చెప్పమని చంద్రబాబే నెల్లూరు ప్రచారంలో తెలిపారు. అయినప్పటికీ బ్యాంకుల ఉద్యోగులు మాత్రం పథకాల కోసం బ్యాంకుల రూల్స్ మారవని అంటున్నారు.

  ఇప్పుడు డబ్బులు చేతికి రాని మహిళలకు ఉన్న ఆప్షన్ ఒక్కటే. ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పడం. అది సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల డబ్బులు రానివారంతా నిరాశతో ఉండిపోవాల్సిందేనా, స్వయంగా సీఎమ్మే చెప్పినా... బ్యాంకుల ఉద్యోగులు రూల్స్ మార్చుకోరా... ఈ విషయంలో ప్రభుత్వం పైపై ప్రకటనలతోనే సరిపెడుతుందా... పట్టుదలతో ముందుకెళ్లి... మహిళల చేతికి డబ్బులు వచ్చేలా చేస్తుందా అన్నది తేలాల్సిన అంశం.


  ఇవి కూడా చదవండి :

  పిల్లల్ని బడికి పంపితే... వైసీపీ ఇస్తానన్నది రూ.15,000... టీడీపీ ఇస్తానంటున్నది రూ.18,000

  నా భర్తే తన ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు... ఓ భార్య వ్యథ...

  పోలవరం నిజం.. ఎవరు పూర్తిచేస్తే వారికే ఓటేయండి: హీరో శివాజీ

  మేనిఫెస్టోల పండగ ముగిసింది... ఇక పోల్ స్ట్రాటజీపై దృష్టిపెడుతున్న పార్టీలు... ఎలాగంటే...

  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu

  ఉత్తమ కథలు