టీడీపీ ఎమ్మెల్యే గంటాకు షాక్... ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 18, 2019, 12:21 PM IST
టీడీపీ ఎమ్మెల్యే గంటాకు షాక్... ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)
  • Share this:
కొంతకాలంగా పార్టీ మారేందుకు ప్రయత్నాలు జరుపుతున్న మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు మరో షాక్ తగలనుంది. ఆయనకు సంబంధించిన ఆస్తులు వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో డిసెంబర్ 20వ తేదీన గంటా ఆస్తులకు వేలం నిర్వహించాలని బ్యాంకు నిర్ణయించింది. అప్పు మొత్తం రూ.209 కోట్లు కాగా.. తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా బకాయిల కోసం వ్యక్తిగత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నట్లుగా గతంలోనే ఆరోపణలు వచ్చాయి.




First published: November 18, 2019, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading