హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అలాంటి నీచ చరిత్ర నీది.. విజయవాడ ప్రజలు అదృష్టవంతులు : పీవీపీపై బండ్ల గణేష్ ఫైర్

అలాంటి నీచ చరిత్ర నీది.. విజయవాడ ప్రజలు అదృష్టవంతులు : పీవీపీపై బండ్ల గణేష్ ఫైర్

బండ్ల గణేష్ ఫైల్ ఫోటో

బండ్ల గణేష్ ఫైల్ ఫోటో

Bandla Ganesh Vs PVP : ఇండస్ట్రీకి హిట్లు,బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం తెలుసు కానీ స్కామ్ రాజా ఇలా కోర్టు చుట్టూ తిరగడం నేర్పాడు అంటూ బండ్ల గణేష్ పీవీపీపై విమర్శలు చేశాడు. ప్రపంచం,భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు కమల్ హాసన్‌నే కోర్టుకు లాగిన నీచ చరిత్ర నీదంటూ ఫైర్ అయ్యాడు.

ఇంకా చదవండి ...

సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు రచ్చకెక్కాయి.'టెంపర్' సినిమా ఫైనాన్స్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ దాకా చేరింది.శుక్రవారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.ఆ తర్వాత ట్విట్టర్‌లో బండ్ల గణేష్ పీవీపీపై విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి వరుస ట్వీట్లతో పీవీపీపై బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు.

కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో విజయవాడ ప్రజలు ఎంత అదృష్టవంతులో అర్థమవుతోందని పరోక్షంగా పీవీపీని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. 'అమ్మో చిన్న పొరపాటు జరిగి ఉంటే ఘోర ప్రమాదం జరిగిపోయేది' అని ఎద్దేవా

చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పీవీపీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు.

తీసిన ప్రతీ హీరోతో.. ప్రతీ డైరెక్టర్‌తో గొడవలు, పంచాయితీలే అంటూ విమర్శించాడు. మాట్లాడితే కోర్టులు, కేసులేనని మండిపడ్డాడు.ఇండస్ట్రీకి హిట్లు,బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం తెలుసు కానీ స్కామ్ రాజా ఇలా కోర్టు చుట్టూ తిరగడం నేర్పాడు అంటూ విమర్శలు చేశాడు. ప్రపంచం,భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు కమల్ హాసన్‌నే కోర్టుకు లాగిన నీచ చరిత్ర నీదంటూ ఫైర్ అయ్యాడు.

కాగా, టెంపర్ సినిమా సమయంలో బండ్ల గణేష్ పీవీపీ నుంచి రూ.30కోట్లు ఫైనాన్స్ తీసుకున్నాడు.అందులో రూ.23 కోట్లు తిరిగి చెల్లించిన బండ్ల గణేష్.. మిగతా డబ్బు మాత్రం చెల్లించడం లేదని పీవీపీ ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై కొంతకాలంగా బండ్ల గణేష్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ..ఉన్నట్టుండి బండ్ల గణేష్ అనుచరులు తనను బెదిరించారని బంజారాహిల్స్ పోలీసులకు పీవీపీ ఫిర్యాదు చేశారు. పీవీపీ ఆరోపణలు ఖండించిన బండ్ల గణేష్.. అదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పీవీపీపై ఫిర్యాదు చేశారు. బండ్ల ఫిర్యాదును పోలీసులు లీగల్ ఒపీనియన్ కోసం పంపించారు.

First published:

Tags: Bandla Ganesh, Potluri Varaprasad, Temper

ఉత్తమ కథలు