జబర్దస్త్ నాగబాబుకు బాలయ్య షాక్ ట్రీట్ మెంట్ ? ఏంటది ?

ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చేశాయి... అధికార టీడీపీ చిత్తుగా ఓడినప్పటికీ, బాలయ్య మాత్రం ఎప్పటి లాగే భారీ మెజారిటీతో గెలిచారు. అయితే బాలయ్యపై వ్యక్తిత్వంపై ఎదురుదాడి చేసిన నాగబాబు నర్సాపురంలో ఘోర పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నాగబాబు పరాజయం పాలై, బాలయ్య విజయం సాధించడంతో అభిమానులు ఒకింత గర్వంగా ఫీలవుతున్నారు.

news18-telugu
Updated: May 25, 2019, 8:42 PM IST
జబర్దస్త్ నాగబాబుకు బాలయ్య షాక్ ట్రీట్ మెంట్ ? ఏంటది ?
బాలకృష్ణ, నాగబాబు..
news18-telugu
Updated: May 25, 2019, 8:42 PM IST
ఎన్నికలకు ముందు సోషల్ మీడియా వేదికగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై నటుడు, జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు వరుస వీడియో పోస్టులతో విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా బాలయ్య వ్యక్తిత్వంపై కామెంట్స్ తో పాటు చిన్నపాటి స్కిట్స్ పోస్ట్ చేస్తూ నాగబాబు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ప్రతీ రోజు ఒక తాజా వీడియోతో నాగబాబు యూట్యూబ్ లో దర్శనమిచ్చినప్పటికీ, బాలయ్య మాత్రం వాటిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే చివరకు నాగబాబే ఇక్కడితో వివాదం కొనసాగించడం లేదని వీడియో చెప్పి ఈ వివాదానికి స్వయంగానే ముగింపు పలికారు. అయితే నాగబాబు చేసిన కామెంట్స్ పై మాత్రం బాలయ్య అభిమానులు కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. అప్పటి నుంచి నాగబాబు ఏ సామాజిక వేదికపై కనిపించినా, కామెంట్స్ పెట్టడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే అనూహ్య పరిణామాల మధ్య నాగబాబు నర్సాపురం పార్లెమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగాడు. అయితే గతంలో లాగే బాలయ్య కూడా హిందూపూరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే నాగబాబు ముగింపు పలికిన వివాదం గురించి అంతా మరిచిపోయారు. ఎన్నికల్లో బాలయ్యను టార్గెట్ చేస్తూ నాగబాబు విమర్శలు చేయనప్పటికీ, ఆయన మొదలు పెట్టిన నెగిటివ్ ప్రచారం మాత్రం సోషల్ మీడియా గ్రూపుల రూపంలో ట్రోల్ అవ్వడం ప్రారంభమైంది. ముఖ్యంగా బాలయ్య వ్యక్తిత్వంపైనా, అలాగే అభిమానులతో వ్యవహరించే తీరుపైనా ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కనిపించింది. కొన్ని చానెల్స్ సైతం అదే పనిగా బాలయ్యను టార్గెట్ చేస్తూ పదే పదే వివాదాస్పద దృశ్యాలను ప్రసారం చేసి నెగిటివ్ ఇమేజ్ ను బలంగా తీసుకుళ్లే ప్రయత్నం చేశారు.

అయితే ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చేశాయి... అధికార టీడీపీ చిత్తుగా ఓడినప్పటికీ, బాలయ్య మాత్రం ఎప్పటి లాగే భారీ మెజారిటీతో గెలిచారు. అయితే బాలయ్యపై వ్యక్తిత్వంపై ఎదురుదాడి చేసిన నాగబాబు నర్సాపురంలో ఘోర పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నాగబాబు పరాజయం పాలై, బాలయ్య విజయం సాధించడంతో అభిమానులు ఒకింత గర్వంగా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం నాగబాబుకు బాలయ్య తన విజయంతో సరైన సమాధానం చెప్పారని అంటున్నారు.

First published: May 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...