హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dr.Venkata Subbaiah passes away: బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

Dr.Venkata Subbaiah passes away: బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

Dr.Venkata Subbaiah passes away: వైసీపీకి తీరని లోటు. ఎంతో భవిష్యత్ ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Dr.Venkata Subbaiah passes away: వైసీపీకి తీరని లోటు. ఎంతో భవిష్యత్ ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Dr.Venkata Subbaiah passes away: వైసీపీకి తీరని లోటు. ఎంతో భవిష్యత్ ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

  Dr.Venkata Subbaiah: ఆదివారం ఓ దుర్వార్త వైసీపీ నేతలు, శ్రేణులను విషాదంలో ముంచేసింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోలుకోవడం కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. చక్కగా కోలుకున్నారు. ఆ తర్వాత కడపలోని తన ఇంటికి వెళ్లి... రోజువారీ కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోయారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఆయన యాక్టివ్‌గా కనిపించారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి భారీ మెజార్టీ రావాలని గట్టిగా శ్రమించారు. ఈ క్రమంలో ఆయన తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. దాంతో మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన్ని కుటుంబ సభ్యులు కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య.

  Venkata Subbaiah passes away, Venkata Subbaiah, badvel ycp mla, badvel ycp mla passes away, badvel constituency, kadapa district, ap news, breaking news, telugu news, వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత, బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే, కడప వైసీపీ ఎమ్మెల్యే, వెంకట సుబ్బయ్య,
  బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (File Image - credit - twitter)

  ఇది కూడా చదవండి: Horoscope Weekly: ఈ వారం రాశి ఫలాలు.. మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు వారఫలాలు

  వెంకట సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమ్మెల్యే మృతిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  ఎమ్మెల్యే ఇక లేరు అనే వార్త వైసీపీ నేతలు, కార్యకర్తలను విషాదంలో ముంచేసింది. వారంతా తమ ప్రియమైన నేతతో రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బాగా చదువుకున్న వెంకట సుబ్బయ్య ప్రాతినిధ్యంతో బద్వేలు మరింత అభివృద్ధి చెందుతుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. ఐతే... ప్రజా సేవలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోయిన ఎమ్మేల్యే... తమ కోసం చివరకు ప్రాణాలే కోల్పోయారని వారంతా విషాదంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే మృతిపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

  First published:

  Tags: AP News, Kadapa, Telugu news

  ఉత్తమ కథలు