Badvel By-Poll : వైఎస్సార్సీపీ (YSRCP) సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా (Kadapa Dist.) బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షం తప్పుకొన్నా.. జాతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
వైఎస్సార్సీపీ (YSRCP) సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా (Kadapa Dist.) బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది. అధికార పక్షం.. ఆనవాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. సాధారణంగా పలుసందర్భంగాల్లో ఈ ఎన్నికలు ఏకగ్రీవాలు అవుతుంటాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆ అవకాశానికి తావు ఇవ్వడం లేదు. సీఎం సొంత జిల్లా కావడంతో ఈ నియోజవర్గంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రధాన పోటీదారుగా ఉంది. రాష్ట్రంల ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desham) ఈ ఎన్నికలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాలని భావించినా సెంటిమెంట్, ఆనవాయితీని పాటించాలని నిర్ణయం తీసుకొంది. అంతే కాకండా గత ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపుకున్నా.. ప్రతిపక్షంలా ప్రశ్నిస్తామంటూ నిరంతం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్న జనసేన కూడా పోటీ నుంచి తప్పుకొంది.
బరిలో 15 మంది..
రాష్ట్రంలో నామమాత్రంగా ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లు మాత్రం పోటీలో ఉన్నాయి. వాటికి తోడు.. చిన్నాచితక పార్టీలు, స్వతంత్రులు నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 35కు చేరాయి. అయితే నామినేషన్ ఉపసంహరణ ముగిసే సమయానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది..
అయితే, ఇవాళ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో.. ఉప ఎన్నికల బరిలో మొత్తంగా 15 మంది అభ్యర్థులు మిగిలారు.. నోటిఫికేషన్ (Notification) నుంచి నామినేషన్ గడువు ముగిసేలోపు మొత్తం 35 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో పరిశీలనలో 9 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.. మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు అయ్యింది.
ఉప ఎన్నికలో లాభం ఎవరికీ..
ఈ దేశంలో ప్రతీ ఎన్నిక ఒక ప్రజలకు ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. నిజానికి ఉపయోగపడాలి కూడా అదే ప్రజస్వామ్య సూత్రం. లబ్ధి అంటే తాయిలాలు పంచడం అనే అభిప్రాయంలో కాకుండా ప్రజా సమస్యలు చర్చకు వస్తాయి. ఇదే అన్నింటికన్న ప్రధానం. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే చనిపోతే మళ్లీ ఆ కుటంబంపై సాధారణంగా ప్రజలకు సానుభూతి ఉంటుంది. వారిని గెలిపించడానికి ఎక్కువ ఇష్టం చూపుతారు. ప్రత్యర్థులు సైతం పక్కకు తప్పుకొంటారు. ఇది చాలా సందర్బాల్లో జరుగుతూనే ఉంటుంది. ఈ ఆనవాయితీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
ఈ సారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపఎన్నికలో ఎవరికి లబ్ధి అని స్పష్టంగా చెప్పడం కష్టం.. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేక పోవడం అధికార పక్షానికి చాలా మేలు. ప్రజా సమస్యలపై చర్చకు తెచ్చేది ప్రధాన ప్రతిక్షమే. అదే పోటీలోనుంచి తప్పుకొంటే అధికార పక్షానికి ప్రశాంతం. ఈ సారి అద్భుత ఫలితాలను ఆశించలేం. కానీ అధికార పక్షం వైఎస్సార్సీపీ మాత్రం ఎన్నికల గెలుపు కోసం ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆశ్రద్ధకు తావులేకుండా ఉండేందు.
ఎందుకు.. ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయకున్నా.. పోటీలో ఉన్న బీజేపీకి బహిరంగంగా కాకుండా అంతర్గతంగా మద్దుతు ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం అధికార పక్షం పార్టీ నేతల్లో ఉంది. అది గెలుపును ప్రభావితం చేస్తుందా లేదా తరువాతి విషయం కానీ.. ఉనికి కోసం పోరాడే పార్టీకి కచ్చితంగా మెరుగైన ఫలితంగా భావించాల్సి రావొచ్చు.
ఈ సారి బద్వేల్ ఉప ఎన్నిక అధికార పక్షానికి, ప్రతిక్షాల కన్నా.. ఇతరులకే లబ్ధి. ఎందుకంటే తాము పోటీలో ఉన్నాం అంటూ ప్రజల్లోకి వెళ్లే అవకాశం వారికి వచ్చింది. ఇతరుల బలంపై కొన్ని ఓట్లు ఎక్కువగా వచ్చినా కూడా పార్టీ ప్రజల్లోకి వెళ్లడం లాభదాయంగా భావిస్తున్నాయి. గెలుపుపై ధీమా ఉండడంతో పోటీ తీవ్రత లేకపోవడం అంశాల కారణంగా ఓటింగ్ శాతం తగ్గవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలంగాణలో భిన్నంగా..
తెలంగాణ ఏర్పడిన తరువాత నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఈ విధంగా వచ్చింది. కానీ అక్కడ మృతి చెందిందిం ప్రతిపక్ష ఎమ్మెల్యే కానీ అధికార పక్షం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. పోటీ చేసింది. గెలిచింది. ఇది తప్పేమీ కాదు. అదే గతేడాది దుబ్బాకలో అధికార పక్షం ఎమ్మెల్యే చనిపోయిన తరువాత ఆయన సతీమణి పోటీ చేసింది. కానీ ఈ సారి అధికార పక్షానికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆ తదనంతరం వచ్చిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అధికార పక్షం ఎమ్మెల్యే మృతి చెందడంతో వచ్చాయి. ఈ సారి అధికార పక్షానికి మెరుగైన ఫలితం వచ్చింది. ఈ తేడాలకు కారణం రాజకీయం మార్పులు అనడం కన్నా ప్రజా సమస్యల చర్చ పెరగడం. సమస్యలు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తాయో ఫలితాలు మారుతాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.