BAD NEWS GOVERNMENT EMPLOYEE AND PENSIONERS THESE MONTH SALARIES DOUBT BECAUSE OF PROCESS NOT AT START NGS GNT
No Salaries: ఉద్యోగులకు ఈ నెల జీతాలు బంద్.. కుదరదన్న పే అండ్ అకౌంట్స్ అసోసియేషన్
సమ్మెకు సై అన్న ఉద్యోగ సంఘాలు
No Salaries: ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల అకౌంట్లో జీతాలు పడే అవకాశం లేదా..? కొత్త పీఆర్సీ ప్రకారం జీతం వద్దంటున్నారు ఉద్యోగ సంఘాలు.. పాత జీతాలు వేయడం కుదరదు అంటోంది ప్రభుత్వం.. వచ్చే నెల టైంకు జీతాలు పడాలి అంటే ఇప్పటికే ప్రాసెస్ పూర్తి కావాలి.. కానీ ఇప్పటికే ప్రాసెస్ ప్రారంభమే కాలేదు..
AP Treasury employees refusing: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల జీతాలు లేనట్టేనా..? ఇప్పటికే ప్రాసెస్ మెదలవ్వాలి.. ఈ నెల 25 తేదీలోపు జీతాలకు సంబంధించిన ప్రాసెస్ పూర్తి కావాలి.. కానీ ప్రస్తుతం కొత్త పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలకు వేస్తే కుదరదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కొత్త జీతాలు కాకుండా పాత జీతాలు వేయాలని ఉద్యోగ సంఘాలు సోమవారం సీఎస్ ను కోరనున్నాయి. కానీ ప్రభుత్వం మాత్ర తగ్గదే లే అంటూ.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తామని తేల్చి చెప్పేసింది.. అయితే ఆ కొత్త జీతాల ప్రాసెస్ ను పూర్తి చేయాలి అంటూ మొదట ట్రెజరీ శాఖకు పంపించింది ప్రభుత్వం..
ఇదే సమయంలో ఏపీ ట్రెజరీ ఉద్యోగులు (AP Treasury Employees ) ఏపీ ప్రభుత్వాని (AP Government)కి షాక్ ఇచ్చారు. కొత్త పీఆర్సీ (New PRC)తో జీతాలు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యమంలో పాల్గొంటున్న ట్రెజరీ ఉద్యోగులు.. సహాయ నిరాకరణకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు నిరాకరించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు (Salaries) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు జీవో జారీ చేసింది. తాజా జీవోల ప్రకారం ఈనెల 25వ తేదీలోగా వేతనాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి.. ప్రాసెస్ పూర్తి అయితే ఫిబ్రవరి జీతాలు ఉద్యోగుల అకౌంట్ లోకి పడతాయి.. కానీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ, డ్రాయింగ్ అధికారులు నో అంటున్నారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, తమకు అన్యాయం జరుగుతుంటే.. జీతాలు ప్రాసెస్ చేయలేమని తేల్చి చెబుతున్నారు.
ట్రెజరీ ఉద్యోగుల నిర్ణయంతో.. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.. ట్రెజరీ ఉద్యోగులు కొత్త పీఆర్సీ జీతాలను ప్రోసెస్ చేయుటకు సహకరించడం లేదు కాబట్టి.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు అకౌంట్లో పడాలి అంటే.. ఆ ప్రాసెస్ ను చేయుటకు పే&అకౌంట్ ఆఫీస్ ( సీఎఫ్ఎంఎస్ ) ఉద్యోగులకు ఆ బాధ్యత అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
అయితే ప్రభుత్వం పంపిన ఉత్తర్వులకు పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు కూడా షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన 11 వ వేతన సవరణ ఉత్తర్వులు వెంటనే వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్నాతాధికారులు పీఆర్సీ బిల్లులను ప్రాసెస్ చేయాలి అంటు పీఏఓ ఉద్యోగులపై ఒత్తిడి చేయడాన్ని నిరసిస్తున్నామని పీఏఓ ఉద్యోగుల సమాఖ్య స్పష్టం చేసింది. Pay&Accounts Letter (1)
అటు ట్రెజరీ ఉద్యోగులు నో చప్పారు.. ఇప్పుడు పే అండ్ అకౌంట్స్ సమాఖ్య కూడా కుదరదని తేల్చి చెప్పేసింది.. మరి ఉద్యోగులకు జీతాలు పడేది ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఫిబ్రవరి తొలి వారంలోనే జీతాలు అకౌంట్లో పడాలి అంటే.. ఈ నెల 25వ తేదీలోపు జీతాలకు సంబంధించి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆదివారం సెలవు రోజు.. ఇక మిగిలింది.. సోమ, మంగళవారాలే.. ఈ లోపు ఉద్యమం సద్దుమణిగే అవకాశం లేదు.. కాబట్టి ఈ నెల జీతాలు పడడం అనుమానే కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.