హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: ఆనందయ్య మందు పంపిణీ ఇప్పట్లో లేనట్లేనా? అడుగడుగునా అవాంతరాలు

Nellore: ఆనందయ్య మందు పంపిణీ ఇప్పట్లో లేనట్లేనా? అడుగడుగునా అవాంతరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అధికారులు తమకు అందిన సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా రోగులు, వారి బంధువులకు సోమవారం నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. జాబితాలోని 92 మంది ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. 42 మంది తాము అసలు ఆనందయ్య వద్ద నుంచి మందే తీసుకోలేదని చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

  ఆనందయ్య ఆయుర్వేద మందు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన తెలిసిందే. ఈ మందు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ మందు పంపిణీ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఆనందయ్య ఆయుర్వేద మందుపై CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్) చేేపట్టిన అధ్యయానానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆనందయ్య వద్ద ఎంత మంది మందు తీసుకున్నారు? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఆరాతీస్తున్నారు. ఆ బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద ప్రాంతీయ పరిశోధనా సంస్థ, తిరుపి ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాలకు CCRAS అప్పగించింది. తొలి దశలో 500 మంది నుంచి ప్రాథమిక సమాచారం సేకరించి మందు పనితీరుపై ఓ అంచనాకు రావాలని భావించారు. కానీ మందు తీసుకున్న వారిలో చాలా మంది స్పందించడం లేదు.

  అధికారులు తమకు అందిన సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా రోగులు, వారి బంధువులకు సోమవారం నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. జాబితాలోని 92 మంది ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. 42 మంది తాము అసలు ఆనందయ్య వద్ద నుంచి మందే తీసుకోలేదని చెబుతున్నారు. మరో 32 మంది ఒకే నెంబర్‌ను ఇచ్చారు. ఆనందయ్య మందు తీసుకున్న వారిలో చాలా మంది కరోనా రాకుండానే వైద్యం చేయించుకున్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా మందు వేసుకున్నట్లు వెల్లడించారు. ఇంకొందరు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ముందు తీసుకున్నారు. కానీ ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.

  ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎలా నివేదిక ఇవ్వాలో అర్ధం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరికొంత మంది ఫోన్ నెంబర్లను పంపించాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులను కోరారు. ఐతే ఇక్కడ మరో చిక్కు ముడి ఉంది. ఆనందయ్య ఇప్పటి వరకు దాదాపు 70వేల మందికి మందు ఇచ్చారు. వచ్చిన వారికి వచ్చినట్లుగా మందు ఇచ్చారు. కానీ వారి నుంచి ఎలాంటి వివరాలు తీసుకోలేదు. అలాంటప్పుడు వారందరినీ ఎలా గుర్తిస్తారన్నది ఇప్పుడు సవాల్‌గా మారింది. మందును తీసుకున్న వారు స్పందించి.. వివరాలు చెబితే గానీ, నివేదిక తయారు చేయలేమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. నివేదిక కూడా ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరి నివేదిక ఎప్పుడు ఇస్తారు? మందు పంపిణీపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Anandaiah corona medicine, Andhra Pradesh, AP News, Ayurveda, Nellore

  ఉత్తమ కథలు