కిడ్నీలో రాళ్లు అనేవి చాలా సాధారణ సమస్య. ప్రస్తుతం వయసుతో పనిలేకుండా కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు పెరిగిపోయారు. బ్లడ్ లో ఎక్కువ కాల్షియం ఉండడం లేదా.. కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్లని ఎక్కువ రోజులు తీసుకోవడం, పాలకూర, నట్స్, చాకొలేట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండడం, ఫైబర్, మెగ్నీషియం తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వంటి అనేక రీజన్స్ కిడ్నీ లో రాళ్లు ఏర్పడడానికి కారణం కావొచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యనుంచి బయట పడాలంటే ఆయుర్వేదంలో చెప్పిన వంటింటి సలహాలు పాటిస్తే.. ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇవి చేయండి:
1) కిడ్నీలో స్టోన్స్ కరగాలంటే ఒక స్పూన్ నిమ్మ రసం, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు నివారించబడటమే కాకుండా తిరిగి కిడ్నీలో రాళ్ళు వచ్చే సమస్యే ఉండదు. 2)నిమ్మ రసంలో సైంధవ లవణం కలుపుకొని తాగడం వలన మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి. 3) పుచ్చకాయలో నీరు, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. 4) నీరు, నిమ్మరసం మిశ్రమంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకుని ప్రతి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట. 5) కిడ్నీ లో స్టోన్స్ నివారణకు వారంలో ఒకసారి ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ కాని, దానిమ్మ గింజలు కాని తీసుకోవడం చాలా బెస్ట్ రెమిడీ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి పాటించండి:
6) ప్రతి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్ధాలు తొలిగిపోతాయి. 7) కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ రసాన్ని ఒడకట్టి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు యూరియన్ రూపంలో బయటకు పోతాయి. కిడ్నీలను శుభ్రపరచడానికి కొత్తిమీర సహజమైన ఔషధమని నవీన్ రోయ్ నడిమిటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 8) అలోవేర జ్యూస్ తాగితే మూత్ర సమస్యలు తగ్గుతుంది 9) యాపీల్ సైడర్ వెనీగర్ ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూను 200 మిల్లీలీటర్లలో కలుపుకొని తాగితే మంచిది. యాపిల్ లో వుండే మాలిక్ ఆసిడ్ ఈ పేరుకొని వున్న క్యాల్షియం ని శరీరం నుండి బయటకు పంపించి వేస్తుంది. 10) పప్పు దినుసులు, జీడి పప్పు, బాదం పప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, అరటి పండ్లు, ఆకు కూరల్లో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు క్యాల్షియమ్ బయటకి పంపబడుతుంది. 11) నేల ఉసిరి ఆకు పొడి రోజుకి 4 గ్రాములు నీటిలో కలుపుకొని తాగడం వల్ల కిడ్నీ ల్లో, అన్ని మృదు కణజాలం లో పేరుకొని వున్న క్యాల్షియం శరీరం నుండి బయటకు పంపించి వేయ బడుతుంది.
ఇక కిడ్నీ రాళ్లు ఎలా ఏర్పడే.. కిడ్నీలు దెబ్బతింటాయంటే:
A-అతిగా మద్యం సేవించడం వలన కిడ్నీలు దెబ్బతింటాయి.
B- అధికమైన ఉప్పును ఆహారంలో తీసుకుంటే అది అధిక ఒత్తిడి, మూత్రపిండాలకు హాని కలిగించే ద్రవం మొత్తాన్ని పెంచుతుంది.
C- పాలు వెన్న జున్ను లాంటి పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం మూత్రపిండాలకు మంచిది కాదు.
D- మాంసాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వలన మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.
E- చేప తినడం వల్ల పెద్దగా హాని ఉండదు.
F- టమాటాల వినియోగం కూడా అదుపులో ఉంచాలి.
G- శీతల పానీయాలు మూత్రపిండాల తీవ్రమైన హాని చేస్తాయి.
H- ఆహారంలో చక్కెర శాతాన్ని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kidney, Local News