హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala-Ayodhya: అయోధ్యలో తిరుమల తరహా విధానం.. యూపీ అధికారులకు టీటీడీ శిక్షణ...

Tirumala-Ayodhya: అయోధ్యలో తిరుమల తరహా విధానం.. యూపీ అధికారులకు టీటీడీ శిక్షణ...

అయోధ్యలో తిరుమల తరహా భద్రత

అయోధ్యలో తిరుమల తరహా భద్రత

తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupathi Devasthanam) స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. టీటీడీ (TTD) ఈవో సారధ్యంలో నడిస్తే.. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడ్డ పాలకమండలి తీసుకుంటుంది.

ఇంకా చదవండి ...

    GT Hemanth Kumar, Tirupathi, News18

    తిరుమల  తిరుపతి దేవస్థానం(Tirumala Tirupathi Devasthanam) స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. టీటీడీ (TTD) ఈవో సారధ్యంలో నడిస్తే.. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడ్డ పాలకమండలి తీసుకుంటుంది. సామాన్య భక్తులకు, మాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిత్యం పర్యవేక్షిస్తోంది టీటీడీ. కలియుగ వైకుంఠంలో స్వయంవ్యక్తమై వెలసిన శ్రీవారి దర్శనార్థం లక్షల సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటారు. ఇలా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తుల భధ్రత పరంగా తిరుపతి నుండి తిరుమల వరకూ అనేక‌ రకాల భధ్రతా చర్యలు చేపడుతుంది. భక్తులు వచ్చినప్పటి నుంచి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవరకు అడుగడుగునా పటిష్ట భద్రతాచర్యలు చేపడుతుంది.

    ముఖ్యంగా తిరుమలకు మహాద్వారంమైన అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టిటిడి విజిలెన్స్ సిబ్బంది నిర్వహించే తనిఖీలు, కొండపై యాత్రికులు బస చేసే వసతి గదుల‌ నుంచి ఆలయంలో ప్రవేశించే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది తీసుకునే జాగ్రత్తలు, అదే‌విధంగా రద్దీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాట్లపై, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రాల వద్ద నిర్వహించే భధ్రత అంటూ ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ సవ్యంగా జరగాలంటే కచ్చితమైన మేనేజ్మెంట్ కలిగి ఉండాలి. అలాంటి స్వయంప్రతిపత్తి కలిగిన మేనేజ్మెంట్ ఉన్న టీటీడీ అన్నిటిలోను ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

    ఇది చదవండి: శ్రీవారి ఆలయంలో ఒక్క రోజు బ్రహ్మోత్సవం.. ఇలా ఎందుకో తెలుసా..?


    టీటీడీ అవలంభిస్తున్న భద్రతా విధానాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రముఖ ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అయోధ్య, శ్రీశైలం వంటి ఆలయాల్లోనూ టీటీడీ తరహా భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. వారం రోజుల క్రితం అయోధ్య అధికారులు, యూపీ పోలీసులు తిరుమల వచ్చి టీటీడీ క్యూలైన్ మేనేజ్మెంట్, ఆలయ నిర్వహణపై టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపినాధ్ జెట్టీ, ఎస్పీ వెంకటప్పల నాయుడులతో సమావేశమయ్యారు.

    ఇది చదవండి: శ్రీవారి దర్శనానికి కొత్త విధానం.. టీటీడీ ఆలోచన వర్కవుట్ అవుతుందా..?


    ఈ మేరకు టీటీడీ సెక్యూరిటీ విధానలపై శిక్షణ కూడా ఇచ్చారు. తిరుపతికి వచ్చే ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ, వాహనాల తనీఖీలు, ఘాట్ రోడ్లలో తనీఖీలు, తిరుమలలో నిషేధిత పదార్ధాల కట్టడి వంటి అంశాలపై వివరించారు. అలాగే తిరుమలలో అక్టోపస్ టీం పనితీరు, శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో గస్తీ, బాంబ్ స్క్వాడ్ విధుల వంటి అంశాలపై సూచనలిచ్చారు. ఇక శ్రీవారి భక్తులను క్యూలైన్లో అనుమంతించే అంశం, తోపులాటలు నియంత్రించడం వంటి విషయాలను కూడా ఇక్కడి పోలీసులు వివరించారు.

    ఇది చదవండి: ఈ బుడతడి టాలెంట్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! పిట్టకొంచెం కూత ఘనం అంటే ఇదే..!


    తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడిని విజిలెన్స్ తనిఖీ చేస్తుందని, మూడు, నాలుగు ప్రదేశాల్లో‌మెటల్ డిటెక్టర్స్, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తుందని టీటీడీ సెక్యూరిటీ విభాగం అయోధ్య పోలీసులకు వివరించింది. టీటీడీ నుంచి పూర్తి వివరాలు సేకరించిన యూపీ పోలీసులు అయోధ్య రామాలయంలోనూ ఇదే తరహా భద్రతను ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలో శ్రీశైలంలోనూ ఇదే తరహా భద్రతా ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయ శాఖ యత్నిస్తోంది. ఈ మేరకు టీటీడీ సెక్యూరిటీ వింగ్ శ్రీశైలం పోలీసులకు కూడా శిక్షణ ఇవ్వనుంది.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ayodhya Ram Mandir, Tirumala Temple, Tirumala tirupati devasthanam

    ఉత్తమ కథలు