AYESHA MURDER CASE VICTIM SATYAM BABU WORTE A LETTER TO VIJAYAWADA COLLECTOR FOR HELP NGS
Satyam Babu: మళ్లీ తెరపైకి సత్యం బాబు.. ఆ పని చేయండి ప్లీజ్ అంటూ ప్రభుత్వానికి వినతి
ప్రభుత్వానికి సత్యం బాబు లేఖ
Satyam Babu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపింది ఆయేషా మీరా కేసు.. అయితే ఆ కేసులు నిందితుడు అనుకున్న సత్యం బాబు కూడా సంచలనంగా మారారు. కానీ కేసుతో సంబంధం లేదంటూ.. నిర్ధోషిగా ప్రకటించింది సత్యం బాబును.. కానీ తరువాత అంతా సత్యం బాబు గురించి మరిచిపోయారు. ఇప్పుడు అకస్మాత్తుగా అతడు తెరపైకి వచ్చాడు.
Satyam Babu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బీ ఫార్మసీ విద్యార్థిణి అయేషా మీరా (Ayesha Meera) హత్య కేసు (Murder Case) పెను సంలనంగా అయ్యింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అని పోలీసులు అరెస్ట్ చేసిన సత్యం బాబు (Satyam Babu).. చాలా రోజుల పాటు శిక్ష అనుభవించారు. కానీ సుదీర్గ విచారణ తరువాత.. ఆ కేసులో నిర్ధోషిగా విడుదలయ్యాడు.. కాని సుమారు తొమ్మిదేళ్లకు పైగా అతడు తన జీవితాన్ని కోల్పోయాడు. ఇంతకీ ఏం జరిగింది అంటే..? 2007 డిసెంబర్ 27న B.Pharmacy విద్యార్ధిని ఆయేషా మీరా విజయవాడలోని హాస్టల్ లో దారుణ హత్యకు గురైంది. బాత్రూంలోని రక్తం మడుగులో ఆయేషా మీరా అనుమానాస్పదస్థితిలో మరణించింది. తన ప్రేమను తిరస్కరించడంతోనే హత్య చేసినట్టుగా ఓ లేఖ కూడా లభ్యమైంది. అత్యాచారం చేసి ఆయేషా మీరాను హత్య చేశారు. ఈ కేసులో క్రిష్ణా జిల్లా (krishna District) జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని నిందితుడిగా గుర్తించి 2008 ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయేషా మీరా కేసులో విజయవాడ ( Vijayawada) మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై బాధితుడు High Court లో అప్పీల్ చేశాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు సత్యం బాబును నిర్ధోషిగా ప్రకటించింది.అంతేకాకుండా దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బాధితుడికి పరిహారంగా రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని సత్యం బాబుకు హైకోర్టు సూచించింది. కానీ ఇప్పటి వరకు తనకు ఎలాంటి న్యాయం జరగలేదంటున్నాడు సత్యం బాబు.
ఈ నేపథ్యంలో సత్యంబాబు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తనకు పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు.. అయితే అయితే ఇప్పటి వరకు తనకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సత్యంబాబు.. తాజాగా ఆ పరిహారం తనకు చెల్లించాలని సత్యం బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు (Delhi Rao)ను కలిశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కు సత్యం బాబు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. రెండు ఎకరాల సాగు భూమితో పాటు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ వినతి పత్రంలో కలెక్టర్ ను కోరారు. చేయని నేరానికి తాను 9 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించినట్టుగా సత్యం బాబు చెప్పారు. ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని కూడా ఆయన ఆ వినతి పత్రంలో కోరారు. ఆయేషా మీరా కేసులో తనను హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించినందున పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
అక్రమంగా కేసు పెట్టి తొమ్మిదేళ్లు జైల్లో ఉంచిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ డిమాండ్ చేశారు. అలాగే సత్యంబాబు కోరుకున్న విధంగా 10 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.