Ys Avinash Reddy: కర్నూల్ విశ్వభారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy) తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జిపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని శుక్రవారమే డిశ్చార్జి చేస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ గుండె సంబంధిత పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్ కు తరలించనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈనెల 19న ఆమె గుండె సంబంధిత ఇబ్బందులతో కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy) ఈనెల 19న సీబీఐ విచారణకు రావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. తన తల్లికి గుండెపోటు వచ్చిందని..అందుకే తాను సీబీఐ విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ ద్వారా తెలియజేశారు. పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో తన తల్లి చికిత్స పొందతుందని..చివరి నిమిషంలో ఈ విషయం తెలియడంతో హుటాహుటిన పులివెందులకు బయలుదేరినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణపై తెలంగాణ హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. గురువారం ఉదయం నుంచి ఎప్పుడెప్పుడు బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ విచారణను వాయిదా వేసింది. వాదనలు వినిపించడానికి ఎంత సమయం కావాలని అవినాష్ (Ys Avinash Reddy), సీబీఐ తరపు న్యాయవాదులను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అయితే గంట సమయం కావాలని సీబీఐ సమాధానం ఇచ్చింది. దీనితో శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు ఈ పిటీషన్ పై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
కాగా అవినాష్ (Ys Avinash Reddy) ముందస్తు బెయిల్ కు సంబంధించి శుక్రవారం కీలక తీర్పు వస్తుందని అంతా భావించారు. ఒకవేళ అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందా? లేక బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తుందా? హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏం చేయబోతోందని సస్పెన్స్ నెలకొంది. సుప్రీంకోర్టు కూడా గురువారం హైకోర్టు ఈ అంశంపై తేల్చాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఏదేమైనా ఇవాళ అవినాష్ (Ys Avinash Reddy) బెయిల్ పై క్లారిటీ వస్తుందని భావించగా శుక్రవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు అనూహ్య ట్విస్ట్ ఇచ్చింది. మరి ఇవాళ విచారణలో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, YS Avinash Reddy