కొడుకు దశదినకర్మ రోజే.. కోడలిని మామ ఏం చేశాడంటే..

వివాహిత యువతి తన ఐదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని మంగళగిరి మండలం యర్రబాలెంలోని తన పుట్టింటికి బయలుదేరింది. విషయాన్ని తన తల్లికి మార్గమధ్యలో ఫోన్ చేసి వివరించింది.

news18-telugu
Updated: June 14, 2020, 3:59 PM IST
కొడుకు దశదినకర్మ రోజే.. కోడలిని మామ ఏం చేశాడంటే..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కట్టుకున్న భర్త చనిపోయి ఆమె పుట్టేడు దుఖంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన చేతులే ఆమెను రోడ్డుపైకి గెంటేశాయి. జీవితాంతం తోడు నీడగా ఉంటాడనుకున్న భర్త కాటికిపోతే.. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన అత్తమామలు కర్కశంగా ప్రవర్తించారు. ఇదేంటని అడగాల్సిన బంధువుల నోళ్లు మూతపడ్డాయి చేసేదేం లేక తన ఐదేండ్ల కొడుకును వెంటపెట్టుకుని పుట్టింటి బాట పట్టింది. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా శ్రీనివాసరావు తోటకు చెందిన ఓ రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతులు తమ కన్న కొడుకును ఇటీవల కోల్పోయారు. కానీ దశదిన ఖర్మ రోజునే కోడలిని దూషిస్తూ ఇంట్లో నుంచి గెంటివేసి సభ్య సమాజానికే తలవంపులు తెచ్చారు.

దీంతో ఆ వివాహిత రోడ్డుపైనే గాజు, పూస్తె తీసి కన్నీళ్ల పర్యంతమైంది. ఇంత జరుగుతున్నా.. దశదిన ఖర్మకు వెళ్లిన బంధువులు సైతం పెదవి విప్పలేదు. దీంతో ఆ వివాహిత యువతి తన ఐదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని మంగళగిరి మండలం యర్రబాలెంలోని తన పుట్టింటికి బయలుదేరింది. విషయాన్ని తన తల్లికి మార్గమధ్యలో ఫోన్ చేసి వివరించింది. అల్లుడి దశదిన కార్యక్రమం రోజు... నెల రోజులు కాకుండా కుమార్తె విధవరాలు పుట్టింటికి వస్తే ఇరుగుపొరుగు ఏమైనా అనుకుంటారనుకోంది ఆ తల్లి.

చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో భర్త చనిపోయిన తన కుమార్తెకు, మనుమడికి ఓ సత్రశాలలో వసతి కల్పించింది. తన అల్లుడి దశదిన ఖర్మ రోజునే తన కుమార్తెను అత్తమామలు ఇలా గెంటివేయడం ఎంత వరకూ సమంజసమని వాపోయింది. అల్లుడో దశదిన ఖర్మ రోజునే తన కుమార్తెను ఇంట్లో నుంచి గెంటివేసి అవమానించిన ఆమె అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని తెలిపింది.
Published by: Narsimha Badhini
First published: June 14, 2020, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading