Amaravati: మూడు రాజధానులపై ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు

Audimulapu Suresh: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉంటాయి అని చెప్పారని.. తాము ఆ మాటకు కట్టుబడి ఉన్నామని ఆదిమూలపు సురేష్ అన్నారు.

news18-telugu
Updated: September 8, 2020, 8:32 PM IST
Amaravati: మూడు రాజధానులపై ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా రచ్చ జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు అమరావతి రైతులు ఇంకా దీక్షల్లోనే ఉండగా.. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం మీడియాకెక్కి విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ వ్యవహారంపై స్పందించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉంటాయి అని చెప్పారని.. తాము ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇది అభివృద్ది వికేంద్రీకరణ మాత్రమేనని మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. లక్ష కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకాలకు పేరు మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ గతంలో ఇచ్చిన మెనుకు ఇప్పటి మెనుకు తేడా గమనించాలని ఆయన చెప్పారు. రైతులకు ఎప్పుడు కరెంట్ ఉచితంగా ఇవ్వకూడదని చంద్రబాబు వాదించారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్‌కు ఆద్యుడు అయితే.. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవలన్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి వ్యాఖ్యానించారు.

తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని కార్యాలయం నుంచి వచ్చిన ఓ ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని కొడాలి నాని ఆ ప్రకటనలో పేర్కొనడం సంచలనంగా మారింది. దీనిపై సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారని ఆయన తెలిపారు. అన్ని పక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ అన్నట్టు వెల్లడించారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేల బలం లేదని.. ఉన్నవారు కూడా జారిపోతున్నారని కొడాలి నాని అన్నారు. లోకేశ్‌ను ఎమ్మెల్యే చేయడం ఎవరి వల్లా కాదని ఆరోపించారు. ఏపీ గ్రీన్ కార్పొరేషన్ రూ. 30 వేల కోట్లతో తెస్తున్నామని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని అంటే కోర్టుకు వెళ్లి స్టే తేవడం విడ్డూరమని కొడాలి నాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని కొడాలి నాని ప్రకటన చేసిన తర్వాత మరో మంత్రి ఆదిమూలపు సురేష్ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రాధాన్యతను సంతరించుకుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 8, 2020, 8:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading