లంకె బిందెల కోసం సొంత బంధువులే మూగమహిళను బలిచ్చేందుకు ప్రయత్నం

గత శుక్రవారం సమీపంలోని పెద్ద చెరువులో గుంతను తవ్వారు. అందులో భాగంగానే పొలంలో క్షుద్ర పూజలు నిర్వహించి నరబలి ఇచ్చే సమయంలో మూగ మనిషి సరోజనమ్మ తెలివిగా తప్పించుకోవడంతో బతికిపోయింది.

news18-telugu
Updated: May 21, 2020, 3:58 PM IST
లంకె బిందెల కోసం సొంత బంధువులే మూగమహిళను బలిచ్చేందుకు ప్రయత్నం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లంకె బిందెల కోసం ఓ మూగమహిళను సొంత బంధువులు బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎస్ఆర్ పురం మండలం వడ్డీకండ్రిగ గ్రామానికి చెందిన శేషాద్రి, సుబ్బమ్మ తల్లీకొడుకులు. వారి పొలంలో లంకె బిందెలున్నాయని ఓ మాంత్రికుడు చెప్పాడు. వాటిని బయటకు తీయాలంటే.. నరబలి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఆ తల్లీకొడుకులు మాంత్రికుడి మాటలు నమ్మి సొంత మూగ అయిన మేనత్త సరోజమ్మను నరబలి ఇచ్చేందుకు శేషాద్రి, సుబ్బమ్మ ప్రయత్నించారు. గత శుక్రవారం సమీపంలోని పెద్ద చెరువులో గుంతను తవ్వారు. అందులో భాగంగానే పొలంలో క్షుద్ర పూజలు నిర్వహించి నరబలి ఇచ్చే సమయంలో మూగ మనిషి సరోజనమ్మ తెలివిగా తప్పించుకోవడంతో బతికిపోయింది. గ్రామస్తుల ద్వారా ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు క్షుద్రపూజలు నిర్వహించిన పొలాన్ని సందర్శించారు. అక్కడ క్షుద్రపూజలు జరిపినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో శేషాద్రి, సుబ్బమ్మలిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
First published: May 21, 2020, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading