హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం..నిందితుని ఆచూకీ చెబితే రూ.20 వేల రివార్డు

Ap: టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం..నిందితుని ఆచూకీ చెబితే రూ.20 వేల రివార్డు

నిందితుని ఆచూకీ చెబితే రూ.20 వేల రివార్డు

నిందితుని ఆచూకీ చెబితే రూ.20 వేల రివార్డు

నిన్న ఏపీలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని ఫోటోలు విడుదల చేశారు. నిందితుని ఫోటోలను పలు పోలీస్ స్టేషన్లకు పంపించారు. నిందితుని ఆచూకీ చెబితే రూ.20 వేల రివార్డ్ కూడా ఇస్తామని కాకినాడ పోలీసులు ప్రకటించారు. ఈ కేసును పెద్దాపురం డీఎస్పీకి పోలీసు ఉన్నతాధికారులు అప్పగించారు. కాగా టీడీపీ నేతపై జరిగిన దాడి వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

నిన్న ఏపీలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని ఫోటోలు విడుదల చేశారు. నిందితుని ఫోటోలను పలు పోలీస్ స్టేషన్లకు పంపించారు. నిందితుని ఆచూకీ చెబితే రూ.20 వేల రివార్డ్ కూడా ఇస్తామని కాకినాడ పోలీసులు ప్రకటించారు. ఈ కేసును పెద్దాపురం డీఎస్పీకి పోలీసు ఉన్నతాధికారులు అప్పగించారు. కాగా టీడీపీ నేతపై జరిగిన దాడి వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా దుండగుడి దాడిలో శేషగిరి రావు చేతికి గాయాలు అయ్యాయి.ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శేషగిరి రావును టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్న రాజప్ప పరామర్శించారు. దీనికి కారణమైన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Unstoppable 2: అలాంటి వ్యక్తుల్లో వైఎస్ఆర్ ఒకరు..? ఆయనపై బాలయ్యకు అంత ప్రేమకు కారణం అదేనా?

అసలేం జరిగిందంటే?..

ఉదయం 7 గంటల సమయంలో భవాని మాలధారణలో గుర్తు తెలియని వ్యక్తి శేషగిరి రావు ఇంటికి వచ్చాడు. అతడిని చూసిన శేషగిరిరావు ఇంట్లో నుంచి కొన్ని బియ్యం తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మాల ధారణలో ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న వస్త్రంలో బియ్యం పోయామని రెండు చేతులతో ఆ వస్త్రాన్ని పట్టుకున్నాడు. శేషగిరి రావు బియ్యం పోస్తున్న క్రమంలో ఆ దుండగుడు తన దగ్గర ఉన్న కత్తితో శేషగిరిరావుపై దాడి చేయబోయాడు. అతని దాడిని గమించిన శేషగిరి రావు అప్రమత్తమై తన చేతిని అడ్డుపెట్టాడు. అయినా కానీ ఆ దుండగుడు శేషగిరి రావుపై దాడి ఆపలేదు. మరోమారు అతనిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం మాల ధారణలో ఉన్న వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. శేషగిరిరావు అరుపులను విన్న కుటుంబసభ్యులు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇంతలో దుండగుడు బైక్ పై పారిపోయినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో శేషగిరి రావు చేతికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దాడి జరిగిన తతంగమంతా సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఆ వీడియోలో దుండగుడు దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటగా కత్తిని కనిపించకుండా దుండగుడు తన దగ్గర ఉన్న టవల్ తో కప్పి ఉంచాడు. ఎప్పుడైతే శేషగిరి రావుపై దాడి చేద్దామనుకున్నాడో ఆ సమయానికే సరిగ్గా కత్తి బయటకు తీసి దాడి చేశాడు. అయితే శేషగిరి రావు అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. తలపై కత్తి వేటు పడితే శేషగిరి రావు అక్కడే చనిపోయి ఉండేవాడు.

ఈ ఘటనపై శేషగిరి రావు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ వీడియోను నిధితంగా పరిశీలిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎందుకు దాడి చేశాడు? ఎవరైనా దాడి చేయాలని ప్రలోభ పెట్టారా అనే కోణాల్లో పోలీసులు దర్యాఫు చేస్తున్నారు. అందులో భాగంగానే నిందితుని ఫోటోలు విడుదల చేసి రివార్డ్ ప్రకటించారు పోలీసులు.

First published:

Tags: Ap, AP News, AP Police, Kakinada, TDP

ఉత్తమ కథలు