హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Devineni Uma: టీడీపీ నేత దేవినేని ఉమ వాహనంపై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

Devineni Uma: టీడీపీ నేత దేవినేని ఉమ వాహనంపై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

దేవినేని ఉమా (ఫైల్ ఫోటో)

దేవినేని ఉమా (ఫైల్ ఫోటో)

Devineni Uma: కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ పరిశీలనకు వెళ్లారు దేవినేని ఉమ. ఆయన అక్కడకు చేరుకోవడంతో టీడీపీ, వైసీపీ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి.

  మాజీమంత్రి దేవినేని ఉమపై వైసీపీ వర్గీయుల రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణగూరు దగ్గర దేవినేని ఉమ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమ ఆరోపించారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ పరిశీలనకు వెళ్లారు దేవినేని ఉమ. ఆయన అక్కడకు చేరుకోవడంతో టీడీపీ, వైసీపీ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ నేత దేవినేని ఉమపై దాడి జరిగింది. దేవినేని ఉమపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసినట్టు టీడీపీ వర్గాలు ఆరోపించారు.

  ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గడ్డమణుగూరు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగింది. అడవిలో అవకతవకలను పరిశీలించేందుకు దేవినేని ఉమా వస్తున్నారన్న సమాచారంతో జి.కొండూరు మండలంలో వైసీపీ కార్యకర్తలు ముందుస్తుగానే అక్కడికి చేరుకుని ఈ రకమైన దాడికి పాల్పడ్డారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

  మరోవైపు ఈ ఘటనపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే దేవినేని ఉమపై దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై ఫిర్యాదు చేస్తూ ఏపీ డీజీపీ సవాంగ్‌కు లేఖ రాశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Devineni Uma Maheswara Rao

  ఉత్తమ కథలు