Home /News /andhra-pradesh /

ATTACK ON TDP MANGALAGIRI OFFICE AND PATTABHI HOUSE BY YSRCP PARTY WORKERS IN ANDHRA PRADESH AK GNT

Breaking: ఏపీలో టీడీపీ నేత ఇల్లు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడి.. పరిస్థితి ఉద్రిక్తం.. ఏం జరిగిందంటే..

పట్టాభి ఇంటిపై దాడిలో ధ్వంసమైన ఫర్నీచర్

పట్టాభి ఇంటిపై దాడిలో ధ్వంసమైన ఫర్నీచర్

Breaking: గంజాయి మాఫియాలో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తూ టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

    ఏపీలోని మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం సహా వివిధ జిల్లాలోని టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. గంజాయి మాఫియాలో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తూ టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. వైసీపీ నేతలు, ఏపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు.. పట్టాభి ఇంట్లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటి తరువాత విజయవాడలో ఉన్న ఆయన నివాసంలోపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆ సమయంలో పట్టాభి పార్టీ కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడి జరిగింది. హిందూపురంలో బాలకృష్ణ క్యాంప్ ఆఫీసుపై కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

    మరోవైపు పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. టీడీపీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశాయి. పలుచోట్ల టీడీపీ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. మరోవైపు టీడీపీ నేత ఇంటిపై జరిగిన దాడి, రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వ్యవహారాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఫోన్ చేసిన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని తమ నేతలు, కార్యాలయాల భద్రత కోసం కేంద్ర బలగాల సాయం కోరినట్టు సమాచారం. మరోవైపు ఈ దాడి ఘటనలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. లక్షలాది టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే వైసీపీ నేతలు రోడ్లపై తిరగగలరా ? అని ప్రశ్నించారు.

    పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి చేరుకున్న అధ్యక్షుడు చంద్రబాబు.. అక్కడ ఉన్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేశారు. టీడీపీ నేతలు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అయితే దాడి విషయం తన దృష్టికి రాలేదని అమిత్ షా చంద్రబాబుకు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని చంద్రబాబు కోరగా.. దీనిపై ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు అమిత్ షా హామీ ఇచ్చారని సమాచారం.

    Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

    Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

    మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం ముందు వైసీపీ మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. పట్టాభి వెంటనే సీఎం జగన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పట్టాభి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముందు పట్టాభి వార్డు మెంబర్‌గా గెలవాలని అన్నారు. ప్రజల నుంచి గెలిచివచ్చిన నేతలం కాబట్టి తాము సమన్వయంతో వ్యవహరిస్తున్నామని అన్నారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు