హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి.. అసలేం జరిగిందంటే..

AP News: బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి.. అసలేం జరిగిందంటే..

బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి

బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి

BJP SatyaKumar: గుంటూరు జిల్లాలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో సత్యకుమార్ (Satya kumar) కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరు(Guntur) జిల్లాలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది. అమరావతిలోనే (Amaravati) రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళన నేటికి 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా మందడంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది అమరావతి జేఏసీ. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. మందడంలో రైతుల దీక్షలో సత్యకుమార్ పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళుతుండగా..మూడు రాజధానులకు అనుకూలంగా దీక్ష చేస్తున్న వైసీపీ శ్రేణులు సత్యకుమార్ వాహనంపై రాళ్ల దాడికి దిగాయి. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ నేతృత్వంలో మూడు రాజదానులకు అనుకూలంగా దీక్ష చేస్తున్న వాళ్లే ఈ దాడికి పాల్పడినట్టు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి అక్కడున్న ఇరు వర్గాల వారికి పంపించేశారు.

మరోవైపు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ వాహనాన్నే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం వెనుక కుట్ర ఉందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలలో బీజేపీ అమరావతికి పూర్తి స్థాయిలో ప్రకటిస్తోందని.. అందుకే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. రాష్ట్రనేతలతో పాటు జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న సత్యకుమార్ కూడా అమరావతికి మద్దతుగా రైతులకు సంఘిభావం చెప్పడానికి వచ్చారు. ఇాలాంటి సమయంలో ఆయనపై దాడి చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులు సంచలనం సృష్టించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిని ప్రాథమికంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులుగా గుర్తించారు. దాడి చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అసలు పరస్పరం ఘర్షణ పడటానికి సత్యకుమార్ కారు మూడు రాజధానుల శిబిరం దగ్గర ఆగలేదని చెబుతున్నారు. రాళ్ల దాడికి పాల్పడటంతో కొంత మంది బీజేపీ కార్యకర్తలు కారు దిగి ప్రశ్నించారు. వారిపై ఇష్టం వచ్చినట్లుగా కొంత మంది యువకులు దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోల్లో రికార్డు అయ్యాయి.

Tirumala: మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి దివ్యదర్శనం టికెట్లు

AP Politics: వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? కేంద్రం చేతిలో కీలక రిపోర్ట్..

మరోవైపు ఈ ఘటన వ్యవహారంలో పోలీసుల తీరుపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా దాడి జరిగే వరకూ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. జాతీయ స్థాయి నేతపైనే ఉద్దేశపూర్వకంగా రాళ్ల దాడి చేయడంతో ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ దాడిపై తక్షణం కేసు నమోదు చేయాలని డీజీపీని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.

First published:

Tags: Andhra Pradesh

ఉత్తమ కథలు