ATMAKUR BYPOLL UPDATES POLLING BEGINS TODAY MAIN FIGHT BETWEEN YSRCP AND BJP NGS
Atmakur Bypoll: ఆత్మకూరు ఉపఎన్నిక: పోలింగ్ షురూ -గెలుపుపై ఎవరి లెక్క ఏంటి..?
ప్రతీకాత్మక చిత్రం
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణంతో ఆత్మకూరుకి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ వైసీపీ (YCP) , బీజేపీ (BJP) మధ్యే నెలకొంది.
Atmakur Assembly By poll: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో బై పోల్ (By Poll) కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ (Andhra Engineer College) లో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్ చక్రధర్‌బాబు (Collector Chakradhar Babu) ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం 278 పోలింగ్ కేంద్రాలకు 377 ఈవీఎంలను పంపిణీ చేశారు. టెక్నికల్ సమస్యలతో ఓటింగ్‌కు ఇబ్బంది రాకుండా అదనపు ఈవీఎంలను ఇచ్చి.. ముందుజాగ్రత్తలు తీసుకున్నారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలో మొత్తం రెండు లక్షల 13 వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది ఉంటే పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు. వీటిలో సమస్యాత్మక ప్రాంతాలు 122 ఉన్నాయి. ఈ ఎన్నికల విధుల్లో 1339 సిబ్బంది ఉన్నారు. 1032 పోలీస్ సిబ్బంది బందోబస్తులో పెట్టారు. 142 మైక్రో అబ్జర్వర్స్, 38 సెక్టార్ ఆఫీసర్స్‌ను పెట్టారు. 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణంతో ఆత్మకూరుకి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ వైసీపీ (YCP) , బీజేపీ (BJP) మధ్యే నెలకొంది. అక్కడ మరిణించింది మంత్రిగా చేస్తున్న మేకపాటి గౌతం.. మరోవైపు ఉప ఎన్నికలో ఆయన కుటుంబ సభ్యుడికే పార్టీ సీటు ఇచ్చింది. దీంతో టీడీపీ గత సంప్రదాయాలను అనుసరించి పోటీలో లేదు. జనసేన (Jsnsena) కూడా అదే ఆనవాయితీ కంటిన్యూ చేసింది. అయితే ప్రధానంగా రెండుపార్టీలు రేసులో లేకపోయినా..? ఆ రెండు పార్టీల ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తి పెంచుతోంది.
2019లో ఆత్మకూరులో 83.38 శాతం మేర పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి ఎంత పోలింగ్ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ అధికారులు మాత్రం ఎక్కువమంది ఓటింగ్ లో పాల్గొనేలా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎన్నికల నియమావళి పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు ఈసీ అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఓటర్లు అంతా ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అక్రమాలపై సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. అధికారిక వైసీపీ తన అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో వున్నారు. బీజేపీ తరఫున భరత్ కుమార్ పోటీలో వున్నారు. ఈ ఉప ఎన్నికలో లక్షకు పైగా మెజార్టీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుది. ఉప ఎన్నిక బాధ్యతను సైతం మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానికి అప్పచెప్పారు అధినేత జగన్.. మరోవైపు బీజేపీ సైతం ఈ ఎన్నిక ఫలితం పై భారీగానే ఆశలు పెట్టుకుంది. తమకు మంచి ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు సైతం భారీగా ప్రచారం నిర్వహించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.