Home /News /andhra-pradesh /

ATCHUTAPURAM GAS LEAK ANOTHER POISONOUS GAS LEAK INCIDENT IN BRANDIX COMANY IN ANAKAPALLY HERE IS MORE DETAILS SK

Gas Leak: అచ్యుతాపురంలో మళ్లీ విషవాయువుల కలకం.. 3 రోజుల్లో రెండోసారి గ్యాస్ లీక్

విశాఖలో  గ్యాస్ లీక్

విశాఖలో గ్యాస్ లీక్

Atchutapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్ లీకై 200మందికి పైగా గాయాలయ్యాయి. ఐతే గ్యాస్ ఎక్కడి నుంచి లీకైందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అంతలోనే మరోసారి గ్యాస్ లీకయింది.

    ఏపీలోని అనకాపల్లి (Anakapalle Gas leak) జిల్లాలో మళ్లీ విషవాయువుల కలకం రేగింది.  అచ్యుతాపురం సెజ్‌ (Atchutapuram SEZ)లో మరోసారి  విష వాయువులు వ్యాపించినట్లు ఈనాడు వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. బ్రాండిక్స్ కంపెనీ (Brandix Gas leak) సమీపంలో విష వాయువులు వెలువడినట్లు తెలిసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు పొల్యూషన్ కంట్రోలో బోర్డు (పీసీబీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే పీసీబీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఆదివారం కావడంతో అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న పరిశ్రమలకు చాలా మంది సిబ్బంది విధులకు హాజరుకాలేదు. గ్యాస్ లీకైన సమయంలో సిబ్బంది లేకపోవడంతో.. బ్రాండిక్స్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది.

    కాగా, శుక్రవారం మధ్యాహ్నం బ్రాండిక్స్ అపేరల్ సిటీ పార్క్‌లో తీవ్ర కలకలం రేగిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో కార్మికులు పరుగులు పెట్టారు. దాదాపు 200ల మందికి పైగా సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారందరూ మహిళలే. విషయవాయువు ధాటికి ఎక్కడివాళ్లక్కడే కుప్పకూలిపోయారు. ఇతర సిబ్బంది వారిని సంస్థ వాహనాల్లోనే ఆస్పత్రికి తరలించారు. అచ్యుతాపురం,యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.  వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

    Amaravati: వచ్చే ఎన్నికల్లో అమరావతి నుంచి జగన్ పోటీ..! ఆయనకు వేరే ఆప్షన్ లేదా..?

    ప్రమాదంపై సీఎం జగన్ (AP CM YS Jagan) ఇప్పటికే ఆరా తీశారు. అమ్మోనియా గ్యాస్‌ లీక్, బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనపై అధికారులనుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని వెల్లడించారు. గ్యాస్‌ లీక్‌ను కూడా నియంత్రించారని తెలిపారు

    ఏపీలో సంచలనం.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని హత్యకు కుట్ర..! ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు?

    ఈ ఘటన జరిగిన 36 గంటలు గడిచినా.. ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రాలేదు. అసలు గ్యాస్ ఎక్కడి నుంచి లీకైందన్న వివరాలు తెలియలేదు. లీకేజీ ఘటనపై  విచారణకు పీసీబీ కమిటీ ఏర్పాటు చేసినా.. ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అమ్మోనియా లీకయిందని అధికారులు చెబుతున్నారు. కానీ అది కాకపోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటనపై అచ్యుతాపురం సెజ్ పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. శుక్రవారం జరిగిన ఘటనను మరవకముందే.. ఇవాళ మరోసారి గ్యాస్ లీకైందన్న వార్తలు.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News

    తదుపరి వార్తలు