హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: అశోక్ లేల్యాండ్.. మేడ్ ఇన్ ఆంధ్రా... మా ఘనతేనంటున్న టీడీపీ...

Andhra Pradesh: అశోక్ లేల్యాండ్.. మేడ్ ఇన్ ఆంధ్రా... మా ఘనతేనంటున్న టీడీపీ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో ప్రతిష్టాత్మక పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించింది. కృష్ణాజిల్లా (Krishna District) విజయవాడ (Vijayawada) సమీపంలోని మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ (Mallavalli Industrial Park) లో అశోక్ లేల్యాండ్ (Ashok Leyland) బస్సుల తయారీని మొదలుపెట్టింది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రతిష్టాత్మక పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించింది. కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేల్యాండ్ బస్సుల తయారీని మొదలుపెట్టింది. దాదాపు 75 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ లో అత్యాధునిక సదుపాయాలు నెలకొల్పారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్, జీరో డిస్ ఛార్జ్, ఎల్ఈడీ లైటింగ్ వంటి సౌకర్యాలతో పాటు సంస్థ  పరిసరాల్లో  పొల్యూషన్ కు చోటు లేకుండా బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి ఉంచారు. ఈ యూనిట్ లో కేవలం బీఎస్-6 బస్సులను మాత్రమే తయారు చేయనున్నట్లు అశోక్ లేల్యాండ్ అధికారులు తెలిపారు. ఇక్కడ నుంచి ప్రతి ఏడాది 4,800 బస్సులను తయారు చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు.

  గన్నవరం నియోజకవర్గం పరిధిలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో 2018లో అశోక్ లేల్యాండ్ సంస్థ బస్సుల తయారీ యూనిట్  ఏర్పాటు ను ప్రారంభించింది. రూ.170 కోట్లతో కేవలం మూడేళ్లలోనే యూటిన్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మందికి ఉపాధి లభించనుంది. అన్ని రకాల బస్సులను ఉత్పత్తి చేసేందుకు ఈ ప్లాంట్ ను రూపొందించినట్లు అశోక్ లేల్యాండ్ యాజమాన్యం తెలిపింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఇక్కడే తయారు చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

  ఇది చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే... ప్రధాని మోదీతో సీఎం జగన్  ఇక్కడే ఎందుకు..

  రవాణకు అనువుగా ఉన్నందునే విజయవాడ సమీపంలో తమ యూనిట్ ను ప్రారంభించినట్లు అశోక్ లేల్యాండ్ వర్గాలు తెలిపాయి. కోల్ కతా-చెన్నై హైవేకి సమీపంలో యూనిట్ ఉండటం వల్ల అటు విశాఖతో పాటు భువనేశ్వర్, కోల్ కత.. ఇటు నెల్లూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు, పుణే. భోపాల్, రాయపూర్ వంటి నగరాలకు తరలించడం సులభంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి పూర్తి బాడీతో కూడిన బస్సుల తయారీని ప్రారంభించిన అశోఖ్ లేల్యాండ్.. భవిష్యత్తులో ఫుల్లీ బిల్డ్ లారీలను కూడా తయారు చేయాలని భావిస్తోంది.

  మా ఘనతే: టీడీపీ

  ఇక విజయవాడలో అశోక్ లేల్యాండ్ యూనిట్ ఏర్పాటు మా ఘనతేనని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. 2018 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసిన సంస్థ ఇప్పుడు ఫలితాన్నిస్తోందని చెప్తున్నారు. మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తోందంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శిస్తున్నారు.  ఐతే మల్లవల్లి  ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కీలక పాత్ర పోషించారు.  ముఖ్యంగా భూసేకరణ విషయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసిన ఆయన..  పరిహారం విషయంలో రైతులకు నష్టం వాటిల్లకుండా అప్పటి ప్రభుత్వం నుంచి వారికి మెరుగైన ప్యాకేజీ ఇప్పించారు.

  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Chandrababu Naidu, TDP, Telugu news

  ఉత్తమ కథలు