• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ASHOK GAJAPATI RAJU SACKED AS CHAIRMAN OF RAMATHEERTHAM AND TWO OTHER TEMPLES BOARD CHAIRMAN BA

రామతీర్థం ఘటన.. టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై వేటు వేసిన వైసీపీ

రామతీర్థం ఘటన.. టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై వేటు వేసిన వైసీపీ

అశోక్ గజపతి రాజు, తెలుగుదేశం పార్టీ

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రామతీర్థం రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటన అనంతరం ఆ ఆలయానికి చైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును తప్పించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రామతీర్థం రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటన అనంతరం ఆ ఆలయానికి చైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును తప్పించింది. రామతీర్థం ఆలయ చైర్మన్‌ పదవితోపాటు మరో రెండు ఆలయాల చైర్మన్ పదవుల నుంచి ఆయన్ను తప్పించింది. పైడితల్లి అమ్మవారి ఆలయం, మండపల్లి ఆలయాల బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ చైర్మన్‌గా ఉంటూ కూడా ఆలయాలను సంరక్షించలేకపోయారంటూ ఆయన్ను తప్పిస్తూ దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రామతీర్థం ఘటనపై అశోక్ గజపతిరాజు స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని పాటించాలని కోరుతున్నానన్నారు. జైలుకు వెళ్లివచ్చిన వారు నాయకులైతే ప్రజలకు ఇబ్బందులు వస్తాయని వ్యాఖ్యానించారు. రామతీర్థం రాకుండా చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. హిందూమతాన్ని గౌరవించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అశోక్ గజపతిరాజు చెప్పారు.

    రామతీర్థం ఘటనపై పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ నేతలే ఈ పని చేయించారని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తాము చేయలేదని నారా లోకేష్ సవాల్ చేశారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, జగన్ సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. లోకేష్ సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానని, టైమ్, డేట్ చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు. దీనికి మళ్లీ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఎందుకు మాట్లాడడం లేదని, తానుజగన్‌కు సవాల్ విసిరితే మిగిలిన వాళ్లు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు.

    మరోవైపు రామతీర్థం ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చంద్రబాబును రానివ్వకుండా లారీలు అడ్డు పెట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో పార్టీ జెండాలు పట్టుకుని ఆలయం లోపలికి వెళ్తారా? అంటూ విజయసాయిరెడ్డి కాన్వాయ్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యారు. నెల్లిమర్ల మండలంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష టీడీపీ, ఆ అంశం మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ రామదుర్గం ఘటనకు పాల్పడిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

    దేవుడి సేవ కంటే పవిత్రమైన పని లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయని మండిపడ్డారు. వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం దారుణమన్న చంద్రబాబు.. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఉత్తరాంధ్ర అయోధ్యలో రాముడికి అవమానం జరిగిందని చంద్రబాబు అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: