news18-telugu
Updated: June 5, 2020, 7:27 PM IST
ప్రతీకాత్మక చిత్రం (Image:Facebook)
వానాకాలం ఆరంభంలో చినుకు పడిందంటే చాలు.. రైతు ముఖం వెలిగిపోతుంది. పంట పొలానికి కొత్త అందం వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిల్లి పాది పొలానికి సేద్యం పండగ చేసుకుంటారు. అంతటా నాగలిపట్టి ఏరువాకను జరుపుకుంటే.. అనంతరపురంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వజ్రాల వేట మొదలవుతుంది. తొలకరి చినుకులు పడిన వెంటనే అందరూ పొలాల్లో చేరిపోయి వజ్రాల కోసం వెతుకుతారు. ఈ ఏడాది కూడా జిల్లాలోని వజ్రకరూరు చట్టు పక్కల ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల కోసం పొలాల్లో తిరుగుతున్నారు.
కేవలం స్థానికులే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలివస్తున్నారు. ఉదయాన్నే పొలాలకు వెళ్లి.. మళ్లీ చీకటి పడితేగానీ ఇంటికి రావడం లేదు. కనీసం ఒక్క వజ్రం దొరికినా చాలు.. ఏకంగా జీవితమే మారిపోతుంది. అందుకే
ఉద్యోగులు కూడా ఆఫీసులకు సెలవు పెట్టి.. కుటుంబ సభ్యులు, మిత్రులతో పొలాల బాటపడుతున్నారు. వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. వర్షా కాలం ఆరంభంలో చాలా మందికి వజ్రాలు దొరికినట్లు చాలా సార్లు విన్నాం..చూశాం. ఈసారి కూడా తమకు వజ్రం దొరుకుతుందని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
June 5, 2020, 7:25 PM IST