విజయవాడ దుర్గమ్మ దర్శనం ఇప్పట్లో ఉండదా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనం ఇప్పుడే ఉండకపోవచ్చని తెలుస్తోంది.

news18-telugu
Updated: June 5, 2020, 10:25 PM IST
విజయవాడ దుర్గమ్మ దర్శనం ఇప్పట్లో ఉండదా?
విజయవాడ కనకదుర్గమ్మ
  • Share this:
కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆలయాలు తెరుచుకోనున్నాయి. కేంద్రం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసేందుకు ఆలయాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనం ఇప్పుడే ఉండకపోవచ్చని తెలుస్తోంది. విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు అధికరంగా ఉన్నాయి. కొండ దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా? లేదా? అనే దానిపై తర్జన బర్జనపడుతున్నారు దుర్గగుడి అధికారులు. కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్ కింద ఆలయం వస్తుందో తెలపాలని కలెక్టర్ ను కోరారు దుర్గ గుడి ఈవో సురేష్ బాబు. కొండ వెనకాల విద్యాధరపురం, కుమ్మరిపాలెంసెంటర్, భవానీపురం, కొండ‌దిగువున మల్లికార్జునపేట ఇతర ప్రాంతాల్లో అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తిస్తున్నాయి. ఈ క్రమంలో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించే అవకాశం పై సందిగ్ధత కొనసాగుతోంది.
First published: June 5, 2020, 9:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading