పేకాట స్థావరాలపై దాడులు.. ఐదుగురిని అదుపులోకి..

తాడేపల్లిగూడెంలోని సలాం సెంటర్ వద్ద ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఆ పేకాట శిబిరంపై దాడి చేశారు.

news18-telugu
Updated: April 8, 2020, 7:26 PM IST
పేకాట స్థావరాలపై దాడులు.. ఐదుగురిని అదుపులోకి..
నమూనా చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తితో ఓవైపు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. మరోవైపు మాత్రం కొంతమంది జల్సారాయుళ్ల తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కనీస సామాజిక బాధ్యతను మరిచి.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెంలోని సలాం సెంటర్ వద్ద ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఆ పేకాట శిబిరంపై దాడి చేశారు. రూ.16,400 నగదుతో పాటు ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేదలు, కార్మికులు మూడు పూటలా తినేందుకు తిండి లేక నానా తిప్పలు పడుతుంటే.. వీళ్లు పేకాట ఆడుతుండడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: April 8, 2020, 7:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading