Guntur Jawan Issue: జవాన్ ఇల్లు కూల్చివేత.. రంగంలోకి ఆర్మీ అధికారులు

కూల్చేసిన తన ఇంటిని చూపుతున్న ఆర్మీ జవాన్ గోవింద రెడ్డి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో జవాన్ గోవింద రెడ్డి ఇంటి కూల్చివేతపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణ జరిపారు.

  • Share this:
    గుంటూరు జిల్లా, నరసరావుపేటలో ఆర్మీ జవాన్‌ గోవిందురెడ్డికి చెందిన ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో ఆర్మీ రంగంలోకి దిగింది. ఉన్నతాధికారుల బృందం నరసరావుపేటలో విచారణ చేపట్టింది. సరిహద్దుల్లో దేశం కోసం సేవ చేస్తున్న తన ఇంటిని కొందరు దుండగులు అన్యాయంగా కూల్చేశారని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని గోవింద రెడ్ పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్, నరసరావుపేట సబ్ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు రక్షణ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర రక్షణ మంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విభాగం కర్నల్ విక్రాంత్ సింగ్ బృందం నరసరావుపేటలో పర్యటించింది.

    బరంపేట ప్రాంతంలోని చాకిరాల మిట్టలో దుంగులు కూల్చిన ఇంటిని పరిశీలించారు. ఆర్మీ జవాన్ ఇల్లు నిర్మించిన స్థలం దోబీఖానాకు చెందినదిగా స్థానికులు అధికారులకు తెలిపారు. తాను ఆ స్థలాన్ని 2016లో కొనుగోలు చేసినట్లు అధికారులకు తెలిపిన గోవింద రెడ్డి.. సంబంధిత పత్రాలను వారికి చూపించారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం ఆర్మీ అధికారులు నరసరావుపేట సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ను కలిశారు. దీనిపై డీఎస్పీ విజయభాస్కరరావుతో ఫోన్లో మాట్లాడారు. పోలీసుల డీఎస్పీ సలహాతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి కూల్చివేత విషయంలో తగిన న్యాయం జరిగేలా చూస్తామని కర్నల్ విక్రాంత్ సింగ్... గోవింద రెడ్డికి హామీ ఇచ్చారు.

    అసలేం జరగింది..?

    వారం క్రితం జవాన్ గోవింద రెడ్డికి చెందిన ఇంటిని దుండగులు కూల్చివేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా సీఎం జగన్ ను వేడుకున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో స్థలం కొంటే ప్రభుత్వ భూమి పేరుతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయకుంటే అక్కడే చంపేయాలని వాపోయాడు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండలేకుంటే ఎవరూ ఈ పనిచేసే అవకాశమే లేదన్నాడు. గోవింద రెడ్డి ఆరోపణలపై స్పందించిన మున్సిపల్ అధికారులు అది ప్రభుత్వ స్థలమని స్పష్టం చేశారు. ఐతే గోవింద రెడ్డి కూల్చివేతకు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published: