హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సంక్రాంతికి 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ ..టికెట్‌పై సగం ఛార్జీ అదనం

సంక్రాంతికి 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ ..టికెట్‌పై సగం ఛార్జీ అదనం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

APS RTC: ప్రయాణికులపై పండుగ భారం మోపనుంది ఏపీఎస్ఆర్టీసీ. ఆంధ్రాకు వెళ్లే వారితో పాటు..పండుగ తర్వాత తిరుగు ప్రయాణం చేసే వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. అయితే ఒక్కో టికెట్‌పై అదనంగా సగం ఛార్జీ వసూలు చేయనుంది. ప్రత్యేకంగా నడపనున్న 4వేల సర్వీసుల్లో మాత్రమే అదనపు ఛార్జీ వసూలు చేయనుంది.

ఇంకా చదవండి ...

సంక్రాంతి వస్తుందంటే..ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC)కి పండగే. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రాకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై లాంటి మహానగరాల నుంచి అత్యధిక సంఖ్యలో సొంత ఊళ్లకు ప్రయాణమవుతారు. ఇందులో ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. పండుగ రోజుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా.. అదనపు బస్సులను పండుగ ముందు నుంచే అందుబాటులో ఉంచుతోంది.

ఏపీఎస్‌ఆర్టీసీకి పండగే..

సంక్రాంతి పండుగ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC)ప్రయాణికుల నుంచి టికెట్‌పై అదనంగా డబ్బులు వసూలు చేయనుంది. ఒక్కో టికెట్‌పై సగం ఛార్జీని అదనంగా వసూలు చేయనుంది. పండగ రోజుల్లో 4వేల బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. జనవరి 7వ తేది నుంచి 14వ తేది మధ్య వెళ్లే వారితో పాటు వచ్చే నెల 16న అంటే పండగ తర్వాత స్వస్థలాల నుంచి గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం స్పెషల్ బస్సులను నడపనుంది. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు పండుగ సెలవులు ఉండటంతో హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది ఆర్టీసీ సర్వీసులనే నమ్ముకుంటారు. కొందరు అడ్వాన్స్‌ బుకింగ్ ద్వారా టికెట్‌లు రిజర్వేషన్‌ చేసుకుంటే.. టికెట్‌లు దొరకని వాళ్లు స్పెషల్‌ బస్సుల్లో ఆంధ్రాకు జర్నీ చేస్తారు.

సంక్రాంతి డిమాండ్..

సంక్రాంతి పండుగ రోజుల్లో కోడి పందాలకు ఆంధ్రా బాగా ఫేమస్. వాటిని చూసేందుకు ..ఏపీలో ఉన్న బంధువులు, స్నేహితులతో గడిపేందుకు తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఆంధ్రాకు వేలాది మంది వెళ్తారు. ఏపీఎస్‌ఆర్టీసీ సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఛార్జీలు టికెట్‌పై సగం పెంచితే..టీఎస్‌ఆర్టీసీ మాత్రం పండుగ సమయాల్లో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేంలా అదనపు ఛార్జీలు వసూలు చేయమని ముందే ప్రకటించింది. అంతే కాదు..ఒకే రూట్‌లో ప్రయాణించే వారి కోసం మంత్లీ సీజన్ టికెట్స్ (MST)పై 33శాతం తగ్గింపు ఉంటుందని తెలిపింది. ఈ రాయితీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు వర్తిస్తుందని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

First published:

Tags: Apsrtc, Bus services

ఉత్తమ కథలు