Home /News /andhra-pradesh /

APSRTC UNIONS RAEDY TO JOIN IN EMPLOYEES STRIKE FROM FEBRUARY 7TH THESE ARE THE DEMANDS NGS

APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్.. తాడో పేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కీలక నిర్ణయం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

APSRTC Strike: ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరెన్ మోగింది.. ఆర్టీసీలో అన్ని ప్రధాన సంఘాలు సమ్మె చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. జీతాల విషయంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునే వరకు వెనక్కు తగ్గకూడదని నిర్ణయించాయి.. దీంతో ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    APSRTC Unions Strike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhrar Pradesh Government)- ఉద్యోగ సంఘాల (Employees Union) మధ్య మొదలైన పీఆర్సీ (PRC) వివాదం తీవ్ర పరిణమాలకు దారి తీస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలు సమ్మెకు సై అన్నాయి.. ప్రభుత్వంతో చర్చలకు కూడా ఇష్ట పడడం లేదు.. సమ్మెతోనే తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఉద్యోగ సంఘాలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే దీని సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చాయి. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థ రాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్టు స్పష్టం చేశాయి. అయితే ఈ లోపు ప్రభుత్వం చర్చించి సమ్మెనుంచి వెనుకడుగు వేసేలా చేస్తుంది అనుకుంటే.. పరిస్థితి మరింత ముదిరింది. ఇక చర్చలు అంటూ ఉద్యోగ సంఘాల కోసం ఎదురుచూస్తే పరిస్థితి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ (Minster Botsa satyanarayana) సీరియస్ అయ్యారు. దీంతో ఇక చర్చలు కష్టమే అనే సంకేతాలు అందుతున్నాయి. ఇదే సమయంలో పీఆర్సీ సాధన కమిటీని కాదని సర్వీసు సంఘాల పేరుతో కొందరు వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరపడంతో.. పీఆర్సీసీ సాధన కమిటీ మరింత అలర్ట్ అయ్యింది. ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. సమ్మెతోనే వారికి సరైన సమాధానం చెబుతాం అంటోంది. అయితే తాజాగా ఉద్యోగ సంఘాల సమ్మెకు.. ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటించింది.

    ఇకపై పీఆర్సీ సాధన సమితితో కలిసి పోరాడాలని, 2022, జనవరి 29వ తేదీ శనివారం నుంచి నిరసన దీక్షల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. అలాగే వచ్చే నెల 03, 04వ తేదీల్లో అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. పీఆర్సీ సాధన సమితి ప్రకటించినట్లుగా.. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ యూనియన్ల నిర్ణయంతో ఈ నెల ఆరో తేది అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. భారీగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో చాలామంది ప్రయాణాలకు ఆర్టీసీ బస్సులను వాడుకుంటున్నారు.. కానీ ఇప్పుడు సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోతే అది సామాన్యులపైనా.. ప్రభుత్వ ఖజానాపైనా భారీగా ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది..

    ఇదీ చదవండి : ఇక ఎదురుచూపులు లేవు.. ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రుల ఫైర్

    రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు.. కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. పాత వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. వీరి పోరాటానికి ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపారు. అందులో భాగంగా… మ్మెలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. అన్ని సంఘాలు కలిసి ఏకతాటిపైకి వచ్చి సమ్మెకోసం కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించాయి. ఆర్టీసీ ఎన్ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సహా అన్ని సంఘాల నేతలంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. అన్ని విషయాల్లో పీఆర్సీ సాధన సమితికి అండగా ఉంటమని స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి : 45 నిమిషాల్లోనే టీటీడీ ఫిబ్రవరి కోటా ఫుల్.. సర్వదర్శనం టికెట్లు విడుదల రేపే.. ఎలా బుక్ చేయాలంటే..?

    ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలపైనే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంట్ ఇవ్వాలని సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వైద్యపరంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా కోల్పోయిన పీఆర్సీని తిరిగి రాబట్టుకోవడం, సర్వీసు రూల్స్‌లో జరుగుతోన్న అన్యాయం తదితర సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఫిబ్రవరి 6 ఆర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Apsrtc, RTC Strike

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు