హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సులు.. కొత్త రూల్స్ ఇవే..

ఏపీలో ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సులు.. కొత్త రూల్స్ ఇవే..

 ఆన్‌లైన్‌లోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్లలోనే టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడే టికెట్లు తీసుకోవాలి.

    ఏపీలో ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. డిపో నుంచి డిపోకు మాత్రమే బస్సులను నడుపుతారు. మధ్యలో ఎక్కడా ఆపరు. ముందుకుగా పెద్ద నగరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా 123 డిపోలకు సేవలను విస్తరిస్తారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా అన్ని బస్సుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుల్లో కండక్టర్లు ఉండరు. ఆన్‌లైన్‌లోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్లలోనే టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడే టికెట్లు తీసుకోవాలి. అటు ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐతే టికెట్ చార్జీల పెంపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

    మరోవైపు ఎల్లుడి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు హాజరుకావాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయం సహా అన్ని కార్యాలయాల్లో వంద శాతం హాజరుతో కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లు అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులు విధులుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని.. సిబ్బంది విధిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది.

    First published:

    Tags: Andhra Pradesh, AP News, Apsrtc, Rtc

    ఉత్తమ కథలు