విజయవాడ వాసులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్...

ఏపీఎస్ ఆర్టీసీ మరో సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. విజయవాడ రీజియన్‌లో డోర్ టు డోర్ కొరియర్ సర్వీసును అందించనుంది.

news18-telugu
Updated: December 8, 2019, 2:50 PM IST
విజయవాడ వాసులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీఎస్ ఆర్టీసీ మరో సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. విజయవాడ రీజియన్‌లో డోర్ టు డోర్ కొరియర్ సర్వీసును అందించనుంది. ఆర్టీసీలో పార్శిల్ సర్వీస్ చాలా పాపులర్. అయితే, మనం కొరియర్ చేస్తే.. సంబంధిత బస్టాండ్‌కు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని భారీ పార్శిల్స్, రెగ్యులర్ పార్శిల్స్ ఉంటే ఆర్టీసీనే డోర్ డెలివరీ చేస్తుంది. గార్మెంట్ హోల్ సేల్ డెలివరీ, కూరగాయల వ్యాపారులు ఇలాంటి సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. ఇకపై చిన్న చిన్న కొరియర్లు కూడా మన అడ్రస్‌కే డెలివరీ చేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్లాన్ చేసింది.

మరోవైపు ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, మెడ్‌ప్లస్, అపోలో (డ్రగ్స్), బ్రిడ్జిస్టోన్ (టైర్లు) ఇప్పటికే ఆర్టీసీ పార్శిల్ సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. ఓ వ్యాన్, రెండు ఆటోల్లో పార్శిల్స్‌ను డోర్ డెలివరీ చేస్తున్నాయి. నగరం పరిధిలో అయితే క్వింటాకు రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడవాసులకు ప్రస్తుతం ఈ సౌకర్యం ఉంది.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>