ఆర్టీసీలో అద్దె బస్సులు.. నేటి నుంచే టెండర్లు..

RTC : తెలంగాణలో ఆర్టీసీ వివాదం కొలిక్కి రాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో అద్దె బస్సుల కోసం యాజమాన్యం టెండర్లను ఆహ్వానించింది.

news18-telugu
Updated: December 5, 2019, 6:48 AM IST
ఆర్టీసీలో అద్దె బస్సులు.. నేటి నుంచే టెండర్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ వివాదం కొలిక్కి రాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో అద్దె బస్సుల కోసం యాజమాన్యం టెండర్లను ఆహ్వానించింది. ఏపీ వ్యాప్తంగా 80 ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు, 159 పల్లె వెలుగు బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతోంది. ఈ నెల 5 నుంచి 17 వరకు MSTC ఈ-వేలం పోర్టల్ ద్వారా టెండర్లలో పాల్గొనవచ్చని ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు యాజమాన్యం సూచించింది. పూర్తి వివాలు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు, ఈ నెల 20వ తేదీన టెండర్లు తెరుస్తామని సంస్థ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వెల్లడించారు. టెండరు వేసే వాళ్లు 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వేయవచ్చు. కాగా, టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ APSRTC తెలుసుకోవచ్చు.
First published: December 5, 2019, 6:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading