ఏపీలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. పెరిగిన రేట్లు ఇవే..

పల్లెవెలుగు, సిటీ సర్వీస్‌పై కిలోమీటర్‌కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున పెంచుతున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

news18-telugu
Updated: December 7, 2019, 6:34 PM IST
ఏపీలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. పెరిగిన రేట్లు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ చార్జీలను పెంచింది. ఏపీలో ఆర్టీసీకి ఏటా రూ.1200 కోట్ల నష్టం వస్తుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. పల్లెవెలుగు, సిటీ సర్వీస్‌పై కిలోమీటర్‌కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున పెంచుతున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పెరిగిన రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో త్వరలో చెబుతామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ‘ఏపీఎస్ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఈ నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలి. లేకపోతే దివాలా తీస్తుంది. లేకపోతే ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుంది. అందుకే టికెట్ చార్జీలు పెంచుతున్నాం.’ అని మంత్రి పేర్ని నాని చెప్పారు. చార్జీలు పెంచాలన్న ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. ఎప్పటి నుంచి రేట్లు అమలవుతాయనే విషయాన్ని రెండు రోజుల్లో ఆర్టీసీ ఎండీ ప్రకటించనున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీకి మొత్తం రూ.6735 కోట్ల అప్పు ఉందని మంత్రి పేర్ని నాని చెప్పారు. బ్యాంకులు, వివిధ సంస్థల నుంచి తెచ్చిన అప్పులు రూ.2995 కోట్లు ఉంటే, ఇతరత్రా బకాయిలు అన్నీ కలిపి రూ.3,740 కోట్లు అయ్యాయన్నారు. ప్రతి ఏటా ఆర్టీసీలో 30 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆర్టీసీ వినియోగిస్తోంది. డీజిల్ ధరల పెరుగుదల వల్ల కూడా ఆర్టీసీపై భారం ఉంది. 2015లో డీజిల్ ధరలు లీటర్ సుమారు రూ.50 ఉంటే, ఇప్పుడు లీటర్ రూ.70 వరకు చేరిందన్నారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల సంస్థ మీద ఏటా సుమారు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు భారం పెరుగుతోందన్నారు. ఆ నష్టాలను నివారించేందుకు, ఆర్టీసీకి జీవం పోసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 2015 తర్వాత ఆర్టీసీ చార్జీలు పెరగడం ఇదే తొలిసారి.

ఆర్టీసీని నేరుగా ప్రభుత్వంలో విలీనం చేయడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని పేర్ని నాని అంగీకరించారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదని చెప్పారు.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>