తిరుమలో అన్యమత ప్రచారం వివాదం.. స్టోర్స్ కంట్రోలర్‌పై వేటు

పాత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఉన్నప్పటికీ స్టోర్స్ కంట్రోలర్ జగదీష్ బాబు పట్టించుకోలేదని విచారణాధికారి కేవీఆర్కే ప్రసాద్ నివేదిక ఇచ్చారు.

news18-telugu
Updated: August 25, 2019, 10:26 PM IST
తిరుమలో అన్యమత ప్రచారం వివాదం.. స్టోర్స్ కంట్రోలర్‌పై వేటు
బస్ టికెట్‌పై హజ్, జెరూసలేం యాత్ర యాడ్స్
  • Share this:
ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోన్ స్టోర్స్ కంట్రోలర్ ఎం. జగదీష్ బాబును ఆర్టీసీ ఎండీ సస్పెండ్ చేశారు. తిరుమలలో ఆర్టీసీ టికెట్ లపై అన్యమత ప్రచారానికి సంబంధించి ఆర్టీసీ శాఖాపరమైన విచారణను పూర్తి చేసింది. తిరుమలకు టిమ్ రోల్స్ ను నిర్లక్ష్యంగా సరఫరా చేసిన జగదీష్ బాబును ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు సస్పెండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు ముద్రించిన టిక్కెట్ లను జగదీష్ బాబు చేసినట్టు తేల్చారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరుమల డిపో కు వెయ్యి టిమ్ రోల్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. పాత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఉన్నప్పటికీ స్టోర్స్ కంట్రోలర్ జగదీష్ బాబు పట్టించుకోలేదని విచారణాధికారి కేవీఆర్కే ప్రసాద్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా మత విద్వేషాలకు కారణమైన జగదీష్ బాబును ఆర్టీసీ సస్పెండ్ చేసింది.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>