స్కాన్ చేస్తే టికెట్.. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై డిజిటల్ పేమెంట్స్

ప్రస్తుతం చాలా వరకు దుకాణాల్లో PAYTM, PHONEPE, AMAZON PAY వంటి యాప్స్‌తో క్యూర్ కోడ్ స్కాన్ చేసి కస్టమర్లు డబ్బులు చెల్లిస్తున్నారు. అచ్చం అలాగే క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి బస్సుల్లో టికెట్ తీసుకునే విధానాన్ని తీసుకొచ్చారు.

news18-telugu
Updated: February 19, 2020, 6:09 PM IST
స్కాన్ చేస్తే టికెట్.. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై డిజిటల్ పేమెంట్స్
ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. ఈ అవకాశం ఈరోజు నుండే అమలులోకి వచ్చింది.
  • Share this:
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాల గురించి అందరికీ తెలుసు. టికెట్‌కు సరిపడా చిల్లర లేక.. పెద్దనోట్లు ఇస్తే మిగిలిన చిల్లర డబ్బులు కండక్టర్ తిరిగి ఇవ్వలేక.. నానా కష్టాలు పడుతుంటారు. ఇటు కండక్టర్లు, అటు ప్రయాణికులు.. ఇద్దరికీ ఈ చిల్లర ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో APSRTC కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ ప్రవేశపెడుతోంది. అందుకోసం ప్రత్యేకంగా CHALO యాప్ రూపొందించారు. ప్రస్తుతం చాలా వరకు దుకాణాల్లో PAYTM, PHONEPE, AMAZON PAY వంటి యాప్స్‌తో క్యూర్ కోడ్ స్కాన్ చేసి కస్టమర్లు డబ్బులు చెల్లిస్తున్నారు. అచ్చం అలాగే క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి బస్సుల్లో టికెట్ తీసుకునే విధానాన్ని తీసుకొచ్చారు.

ప్రస్తుతం విజయవాడలో పైలెట్ ప్రాజెక్ట్‌గా క్యాష్‌లెస్ టికెట్ విధానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ మడిరెడ్డి ప్రతాప్ పాల్గొన్నారు. ఛలో యాప్ సాయంతో కండక్టర్ వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చు. అంతేకాదు మెట్రో తరహాలో APSRTC స్మార్ట్ కార్డ్ కూడా తీసుకొచ్చారు. టిమ్ మెషీన్‌లో స్మార్ట్ కార్డ్ పెట్టి చెల్లింపులు చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ క్యాష్‌లెస్ విధానం ద్వారా ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులకూ చిల్లర కష్టాలు తప్పుతాయని అన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ ఈ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు.

ఛలో యాప్ ఆవిష్కరణ


ఛలో యాప్‌తో ఉపయోగాలు:
ప్రయాణికులతో చిల్లర సమస్య ఎదురుకాదు.

ఆర్టీసీ సిబ్బందికి సమయం ఆదా అవుతుంది.

నగదు లేకపోయినా కార్డు ద్వారా ప్రయాణం చేయవచ్చు.

ప్రతిరోజు ప్రయాణం చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుంది.
Published by: Shiva Kumar Addula
First published: February 19, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading