Home /News /andhra-pradesh /

APSRTC READY TO STRIKE THE RTC UNIONS SUPPORT TO GOVERNMENT EMPLOYEES UNION STRIKE SO BUSES STOP FROM FEBRUARY 7TH NGS

RTC Strike: ఏపీలో నిలిచిపోనున్న బస్సులు.. సమ్మెకు సై అన్న యూనియన్లు.. ఎప్పటినుంచి అంటే..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

RTC Strike In AP: ఆంధ్రప్రదేశ్ మరోసారి బస్సులకు బ్రేకులు పడనున్నాయి. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోనున్నాయి. రేపు లేదా సోమవారం దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఆర్టీసీ సంఘాలు నోటీసులు ఇవ్వనున్నాయి. అయితే సమ్మె ఎప్పటి నుంచి ప్రారంభిస్తారంటే..?

ఇంకా చదవండి ...
    RTC Strike In Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సామాన్యులకు ఇబ్బంది తప్పేలా లేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) ఇప్పటికే సమ్మె  సైరన్ మోగించారు.. ఉద్యోగ సంఘాల సమ్మె ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సులపైనా ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలిపాయి.. పీఆర్సీ (PRC) వివాదం మొదలైనప్పటి నుంచి ఆర్టీసీ సంఘాలు కూడా.. ఏపీ ఉద్యోగ సంఘాలకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి. తాజాగా పీఆర్సీ సాధన సమితి చేస్తున్న సమ్మెకి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. దీంతో ఫిబ్రవరి 07వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్లేందుకు సై అన్నారు. ఆర్టీసీకి సబంధించి అన్ని పెద్ద సంఘాలు మద్దతు తెలపడంతో.. ఆర్టీసీ బస్సులు (RTC Buses) డిపోలకే పరిమితం కానున్నాయి. దీనికి సబంధించి.. ఆదివారం లేదా సోమవారం నోటీసులు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు..

    తమ జీతాలు తగ్గించుకోవాలంటే.. కుదరదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నా.. గతంలో ప్రతి నెలా ఒకటి తేదీనే వేతానాలు వచ్చేవి అన్నారు. కానీ ప్రస్తుతం రెండు నుంచి ఏడు… తొమ్మిదో తేదీ వరకు జీతాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ఆ విషయం..ఇక్కడ ఉత్పన్నం కాదని.. కానీ 8 శాతం హెచ్ఆర్ఏ లో పెట్టిన తర్వాత.. జీతాలు తగ్గవని ప్రభుత్వం ఎలా చెబుతుందో అర్థం కావడం లేదన్నారు. ఇంటి అద్దెలో.. తాము నాలుగు వేల రూపాయలు కోల్పోతున్నామన్న విషయం ఉన్నతాధికారులకు ఎందుకు చెవికి ఎక్కడం లేదని ప్రశ్నిస్తున్నారు.

    ఇదీ చదవండి : ఉద్యోగులకు ఈ నెల జీతాలు బంద్.. కుదరదన్న పే అండ్ అకౌంట్స్ అసోసియేషన్

    తమ జీతాలతో ఆర్టీసీ ఆదాయాన్ని ముడిపెట్ట లేం అంటున్నారు. ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేమని.. కేవలం చేసిన పని కూలీ డబ్బులు మాత్రమే మే అడుగుతున్నారు. ఓ వైపు కరోనాతో ఆర్టీసీ అతలాకుతమైంది.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో.. ఆర్టీసీ మరోసారి సమ్మెలోకి వెళితే.. మళ్లీ ఆర్టీసీ నష్టల్లోకి వెళ్లక తప్పదు. మరి ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

    ఇదీ చదవండి : అరుదైన మొక్కకు.. 80 పూలు.. బ్రహ్మ కమలాలను చూసేందుకు ఎగబడుతున్న జనం. ప్రత్యేకతలు ఇవే

    ఇటు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె అయినా.. ఆర్టీసీ సమ్మె అయినా ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలే. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించేందుకు పేద, మధ్య తరగతి ప్రజలే.. చిన్న చిన్న అవసరాలు, అత్యవసరాలైనా అందరికీ అందుబాటులో ఉండేది.. ఆర్టీసీ బస్సులే.. మరోవైపు ప్రభుత్వం కార్యాలయాల్లో నిత్యం వేల మందికి సమస్యలు ఉంటాయి.. సమ్మెతో ఆ సమస్యలు పరిష్కారం కాకుండా నిలిచిపోతాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు