హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రేపటి నుంచే బస్సులు.. APSRTC ఆన్‌లైన్ రిజర్వేషన్లు ప్రారంభం

రేపటి నుంచే బస్సులు.. APSRTC ఆన్‌లైన్ రిజర్వేషన్లు ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటివరకు విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, జర్నలిస్టులు సహా ఆయా వర్గాలకు బస్సు ఛార్జీల్లో అందిస్తోన్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది.

  ఏపీలో బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. బస్సుల్లో కండక్టర్లు ఉండరని.. రిజర్వేషన్‌ చేసుకున్నవారినే బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఆర్టీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాలకు నడిచే బస్సుల వివరాలను ఏపీఎస్‌ఆర్టీసీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. apsrtconline.in వెబ్‌సైట్‌లో ప్రయాణికులు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చని సూచించింది. అయితే అన్ని ప్రాంతాల్లో బస్సులు తిరగవు. నిర్ణీత ప్రాంతాల మధ్య కొన్ని సర్వీసులను మాత్రమే నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింతది. విజయవాడ-విశాఖ మధ్య గురువారం 1 ఏసీ, 6 సూపర్‌ లగ్జరీ బస్సులను మాత్రమే నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికలు భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో.. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కేవలం 18 సీట్లకే రిజర్వేషన్‌ చేసుకునేందుకు అనుమతించారు.

  55 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతుండడం, సీట్ల సంఖ్య కుదించిన నేపథ్యంలో రాయితీలకు సంబంధించి ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, జర్నలిస్టులు సహా ఆయా వర్గాలకు బస్సు ఛార్జీల్లో అందిస్తోన్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం వ్యక్తిగత దూరం పాటించాల్సి రావడంతో బస్సులో సీట్లను సంఖ్యను ఆర్టీసీ ఇప్పటికే కుదించింది. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఆర్డినరీ సహా ఏసీ సర్వీసుల్లోనూ సీట్ల సంఖ్యను తగ్గించింది. ఫలితంగా ఆర్టీసీకి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయా వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ పేర్కొంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Apsrtc, Lockdown, Rtc

  ఉత్తమ కథలు