Home /News /andhra-pradesh /

APSRTC MD MADE KEY STATEMENT ON PRIVATIZATION FULL DETAILS HERE PRN

APSRTC: ఆర్టీసీ ప్రైవేటీకరణ.. మాకు అంత స్థోమత లేదు.. ఎండీ కీలక వ్యాఖ్యలు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) త్వరలోనే ప్రైవేటీకరణ జరుగుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కొత్త బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కొత్త ఉద్యోగాలకు స్వస్తి పలికినట్లేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
    ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) త్వరలోనే ప్రైవేటీకరణ జరుగుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కొత్త బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కొత్త ఉద్యోగాలకు స్వస్తి పలికినట్లేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. ప్రైవేటీకరణ, కొత్త బస్సుల కొనుగోలు, సంస్థ పరిస్థితిపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రంలోకి మరిన్ని అద్దె బస్సులు రానున్నట్లు ఆయన తెలిపారు. సొంత బస్సులు కొనే స్థోమత ఆర్టీసీకి లేనందున కొత్తగా 998 అద్దె బస్సులకు టెండర్లకు పిలిచినట్లు క్లారిటీ ఇచ్చారు. అద్దె బస్సుల పెంపుతో ఆర్టీసీ ప్రైవేటు వాళ్ల చేతిల్లోకి వెళ్తుందనేది పూర్తిగా అవాస్తవమని ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు.

    ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచుతామని ఇప్పటికే ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు టెండర్లకు నోటిఫికేషన్‌ ఇష్యూ చేసింది. హైర్ బస్సుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఆర్టీసీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందన్న ప్రచారంలో నిజం లేదని ద్వారకా తిరుమలరావు తెలిపారు. అద్దె బస్సుల పెంపు వల్ల అందుబాటులోకి కొత్త బస్సులు వస్తాయన్నాయని.., దేశవ్యాప్తంగా రవాణా సంస్థలు సొంత బస్సులు కొని నడిపే పరిస్థితి లేదన్న ఆర్టీసీ ఎండీ.. ఏపీ అందుకు భిన్నింగా లేదని తెలిపారు. అద్దె బస్సుల పెంపు వల్ల ఆర్టీసీకి వాణిజ్యపరంగా లాభమే తప్ప నష్టాలు వచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

    ఇది చదవండి: విద్యార్థులకు అలర్ట్.. రేపు తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ.. లబ్ధిదారులు వీళ్లే..!


    ఆర్టీసీలో 23 శాతం అద్దె బస్సులున్నాయని.. కొత్తగా మరో 998 అద్దె బస్సులకు టెండర్లు జారీ చేశామని ద్వారకా తిరుమల రావు తెలిపారు. వీటితో కలుపుకుని మొత్తం ఆర్టీసీలో 32 శాతం అద్దె బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. అద్దె బస్సుల పెంపు వల్ల ఆర్టీసీకి వాణిజ్యపరంగా లాభమేన్నారు. పైగా అద్దె బస్సుల నిర్వహణ, డ్రైవర్‌ జీతభత్యాలంతా బస్సు యాజమాన్యమే చూసుకుంటుందన్నారు.

    ఇది చదవండి: మేం అలా చేస్తే టీచర్లు సైలెంట్ గా ఉంటారా..? టెన్త్ పేపర్ లీక్ పై మంత్రి బొత్స ఆసక్తికర కామెంట్స్.


    ప్రస్తుతం ఆర్టీసీలో 11,236 బస్సులుండగా.. వాటిలో 8,972 సొంతబస్సులు కాగా.., 2,264 అద్దెబస్సులున్నాయి. వీటిలో దాదాపు 3వేల బస్సులు కాలం చెల్లిపోయాయి. దీంతో వీటి స్థానంలో కొత్త బస్సులు కొనాల్సిన ఆర్టీసీ.. దాదాపు వెయ్యి అద్దెబస్సులకు టెండర్లు పిలవడం చర్చనీయాంశమవుతోంది. వీటితో పాటు 100 ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీ అద్దెరూపంలో తీసుకురానుంది. ఇప్పటికే వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైంది. ఆర్టీసీ అద్దెబస్సుల వైపు చూపుతుండటంతో రెండువేల డ్రైవర్ పోస్టుల భర్తీ నిలిచిపోతుందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఆర్టీసీ అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Apsrtc

    తదుపరి వార్తలు