మళ్లీ ఛార్జీల మోత... పెంచేందుకు రెడీ అవుతున్న ఏపీఎస్ ఆర్టీసీ... ఏకంగా 17 శాతం...

APSRTC : మూడేళ్లుగా ఛార్జీలు పెంచలేదంటున్న ఏపీఎస్ ఆర్టీసీ... ఈసారి పెంచాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రభుత్వం ఊ అంటే... ఇక ఛార్జీల మోతే.

Krishna Kumar N | news18-telugu
Updated: April 30, 2019, 9:40 AM IST
మళ్లీ ఛార్జీల మోత... పెంచేందుకు రెడీ అవుతున్న ఏపీఎస్ ఆర్టీసీ... ఏకంగా 17 శాతం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(సయ్యద్ ఆహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
APSRTC : తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో బస్సుల్లో ప్రయాణించేవాళ్లు ఎక్కువ. ఎందుకంటే అక్కడ తెలంగాణలోలాగా MMTS ట్రైన్లు, మెట్రో రైళ్లూ ఇంకా రాలేదు. అందువల్ల సిటీ నుంచీ పల్లెటూరి వరకూ అందరూ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని APSRTC కూడా పల్లెపల్లెకూ బస్సు సౌకర్యం కల్పించింది. అంతా బాగానే ఉంది కానీ... ఇప్పుడు ఛార్జీలు పెంచాలనే వాదన తెరపైకి తెచ్చింది. ఏ కొద్దిగానో పెంచుతామంటే ప్రజలు కూడా పోనీలే... వాళ్లకూ డీజిల్ ఖర్చులూ, ఇతరత్రా ఉంటాయిగా అని సరిపెట్టుకుంటారు. కానీ ఏపీ ఆర్టీసీ ఏమంటోందంటే... ఏకంగా 15 నుంచీ 17 శాతం ఛార్జీలు పెంచాలని అంటోంది. అది మరి ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్తే. సపోజ్... ఇప్పుడు 10 రూపాయల టికెట్‌తో ప్రయాణించేవాళ్లు... ఛార్జీలు పెంచితే దాదాపు 12 రూపాయలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదే ఏ 300 రూపాయల టికెట్‌కో ప్రయాణించేవాళ్లు... ఏకంగా 350 రూపాయలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్యామిలీతో ప్రయాణిస్తే... ఖర్చుల భారం భరించలేకపోతారు.

ఇవన్నీ ఆర్టీసీకి తెలియనివి కాదు. కానీ వాళ్లేమంటున్నారంటే... మూడేళ్లుగా ఛార్జీలు పెంచలేదనీ, నిర్వహణ భారం పెరిగిపోయిందనీ చెబుతున్నారు. అందుకే ఛార్జీలు పెంచేందుకు అనుమతించండి అంటూ ఆర్టీసీ ఎంపీ సురేంద్ర బాబు... ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి... ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ... నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది కదా... అది కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. మాగ్జిమం ఛార్జీలు పెంచుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే... ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. వీలైనన్ని మార్గాల్లో మనీ రాబట్టడమే నెక్ట్స్ ప్రభుత్వం లక్ష్యంగా ఉంటుంది.

మరీ 17 శాతం పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకపోయినా... ఎంతో కొంత పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలున్నాయి. సో, జూన్ నుంచీ ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం భారం కాబోతోందని అనుకోవచ్చు.

 

ఇవి కూడా చదవండి :

స్టూడెంట్స్ బీ రెడీ... మే రెండో వారంలో ఏపీ టెన్త్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్...టీడీపీకి షాక్... వైసీపీ ఖాతాలోకి గోదావరి జిల్లాలు... కొత్త సర్వేలో ఆసక్తికర అంశాలు...

ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...

పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...
First published: April 30, 2019, 9:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading