అమల్లోకి వచ్చిన ఏపీఎస్‌ ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు..

APSRTC : ఏపీలో బస్సు ఛార్జీలు పెరిగేది ఈ రోజు నుంచే. ఇప్పటికే ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి.

news18-telugu
Updated: December 11, 2019, 6:22 AM IST
అమల్లోకి వచ్చిన ఏపీఎస్‌ ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో బస్సు ఛార్జీలు పెరిగేది ఈ రోజు నుంచే. ఇప్పటికే ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు పెంచనుండగా, మిగతా సర్వీసుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. బస్సు ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి రూ. 900 కోట్ల అదనపు భారం పడనుంది. డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ఇప్పటివరకు బస్ ఛార్జీలు పెరగలేదని, ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఛార్జీలు పెంచాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడాలంటే ఛార్జీలు పెంచడం తప్పనిసరి అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అటు.. తెలంగాణలో పల్లె వెలుగు బస్సుల్లోనూ కిలోమీటర్‌పై 20 పైసలు పెంచగా.. ఏపీలో మాత్రం పల్లె వెలుగుపై పెంపును కిలోమీటర్‌కు 10 పైసలుగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా, బస్సు ఛార్జీల పెంపుపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి బస్సు డిపో ఎదుట నిరసన చేపట్టనుంది.


First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>