APSRTC : ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మె..

APSRTC |జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఎంతోకాలంగా తన న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్నట్లు.. వీటిని తీర్చేందుకు యాజమాన్యం శ్రద్ధ చూపడంలేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి.

news18-telugu
Updated: May 22, 2019, 12:05 PM IST
APSRTC : ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మె..
జూన్ 13 నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ సమ్మె
news18-telugu
Updated: May 22, 2019, 12:05 PM IST
ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఎంతోకాలంగా తన న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్నట్లు.. వీటిని తీర్చేందుకు యాజమాన్యం శ్రద్ధ చూపడంలేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. వీటిపై యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో సమ్మె తేదీని ప్రకటించారు ఆర్టీసీ ఐకాస నేతలు. ఆర్టీసీలో ఉన్న వేల కొద్దీ ఖాళీలను భర్తీ చేయకుండా.. ఉన్న ఉద్యోగులపైనే ఒత్తిడిపెంచుతున్నారని దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు కార్మిక నేథలు చెబుతున్నారు.

కార్మికుల వేతన సవరణ బకాయిల చెల్లింపు సహా 27 డిమాండ్ల పరిష్కార ప్రధాన డిమాండ్‌‌తో పాటు అద్దెబస్సుల పెంపు, సిబ్బందికుదింపు చర్యలు ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సమ్మె విషయంలో ప్రజలు తమ సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...