తెలంగాణ వైన్‌షాప్ వద్ద ఆగిన ఏపీ ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులు షాక్

బస్సు డ్రైవర్ తీరుపై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పించారు. పబ్లిక్ బస్సుల్లో మద్యం అక్రమ రవాణా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సును వైన్ షాప్ వద్ద ఆపి మద్యం కొనుగోలు చేసిన అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Updated: January 29, 2020, 8:39 PM IST
తెలంగాణ వైన్‌షాప్ వద్ద ఆగిన ఏపీ ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులు షాక్
డ్రైవర్‌కు మందు బాటిల్ తీసుకొస్తున్న యువకుడు
  • Share this:
మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. వైన్ షాపులను భారీగా తగ్గించడం, దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుండడం, మద్యం రేట్లను భారీగా పెంచడంతో.. ఏపీలోని మందుబాబులకు కష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో ఏపీ శివారులోని తెలంగాణ పట్టణాల నుంచి కొందరు వ్యాపారులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఏపీలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఇక్కడి నుంచి మందు తీసుకెళ్తున్నారు. ఎలాగోలా చెక్‌పోస్ట్ కళ్లుగప్పి లిక్కర్‌ని పట్టుకెళ్తున్నారు. ఐతే తాజాగా ఓ ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ తెలంగాణలోని వైన్ షాప్ ముందు బస్సు ఆపి.. మద్యం కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమలాపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు (AP05Z5063) బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరింది. 10 గంటల సయయంలో కోదాడ హైవేపై బస్సును ఆపాడు డ్రైవర్. టీ కోసం ఆపాడేమో అని ప్రయాణికులు అనుకున్నారు. కానీ పక్కన వైన్ షాప్ తప్ప ఏమీ లేదు. దాంతో బస్సులో సాంకేతిక లోపం తలెత్తిందేమోనని అనుకున్నారు. ఏం జరిగిందని మాట్లాడుకుంటుండగా.. ఓ కుర్రాడు డ్రైవర్ వద్ద డబ్బు తీసుకొని వైన్ షాప్‌కు వెళ్లాడు. ఓ ఫుల్ బాటిల్ కొనుగోలు చేసి డ్రైవర్‌కు ఇచ్చాడు. బస్సు డ్రైవర్ ఆ మద్యం సీసాను వెనక సీట్లో దాచేశాడు. అనంతరం బస్సును స్టార్ట్ చేసి ముందుకు వెళ్లాడు. ఈ తతంగాన్ని స్థానికులు ఫోన్‌లో వీడియో తీసినా.. సదరు బస్సు డ్రైవర్ మాత్రం ఏ మాత్రం భయపడలేదు.

బస్సు డ్రైవర్ తీరుపై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పించారు. పబ్లిక్ బస్సుల్లో మద్యం అక్రమ రవాణా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సును వైన్ షాప్ వద్ద ఆపి మద్యం కొనుగోలు చేసిన అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో మద్యం కొని అక్రమంగా ఏపీకి తీసుకెళ్లినందుకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులను డమాండ్ చేశారు. అటు ఆర్టీసీ పరంగానూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు