ఏపీలో ఆర్టీసీ బస్సులు షురూ..

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

లాక్‌డౌన్ కారణంగా ఆగిన బస్సులు ఈ రోజు నుంచి రోడ్ల మీదకు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది.

  • Share this:
    లాక్‌డౌన్ కారణంగా ఆగిన బస్సులు ఈ రోజు నుంచి రోడ్ల మీదకు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆర్డినరీ బస్సులను డిపో నుంచి డిపోకు మాత్రమే బస్సులను నడుపుతున్నారు. మధ్యలో ఎక్కడా ఆపరు. దశల వారీగా 123 డిపోలకు సేవలను విస్తరిస్తారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే టికెట్ తీసుకోవాలి. బస్సుల్లో కండక్టర్లు ఉండరు. ఆన్‌లైన్ టికెట్ కొనుక్కోలేని వారి కోసం ఆర్టీసీ బస్టాండ్లలోనే టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే, కోవిడ్-19 నిబంధనలను అనుసరించి.. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా అన్ని బస్సుల్లో ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా, నిన్న మీడియాతో మాట్లాడిన సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్.. ఛార్జీలను మాత్రం పెంచబోమని స్పష్టం చేశారు. విశాఖ, విజయవాడలో సిటీ బస్సు సర్వీసులను తర్వాత ప్రారంభిస్తామని చెప్పారు. అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించారు.

    ‘బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బస్టాండ్‌లలోనూ మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. రూ.10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించాం. శానిటైజర్ సదుపాయాన్ని కూడా కల్పించాం. బస్సు ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నగదు రహితంగా, పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం’ అని తెలిపారు. అదే రోజు ప్రయాణానికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తే రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: