హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు.. టికెట్ ఆన్‌లైన్‌లోనే..

ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు.. టికెట్ ఆన్‌లైన్‌లోనే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

APS RTC : తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ప్రారంభం కాగా, రేపటి నుంచి ఏపీలో ప్రారంభం కానున్నాయి.

    తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ప్రారంభం కాగా, రేపటి నుంచి ఏపీలో ప్రారంభం కానున్నాయి. ఆర్డినరీ బస్సులను డిపో నుంచి డిపోకు మాత్రమే బస్సులను నడుపుతారు. మధ్యలో ఎక్కడా ఆపరు. ముందుకుగా పెద్ద నగరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా 123 డిపోలకు సేవలను విస్తరిస్తారు. అయితే, ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. బస్సుల్లో కండక్టర్లు ఉండరు. ఆన్‌లైన్ టికెట్ కొనుక్కోలేని వారి కోసం ఆర్టీసీ బస్టాండ్లలోనే టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే, కోవిడ్-19 నిబంధనలను అనుసరించి.. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా అన్ని బస్సుల్లో ఏర్పాట్లు చేశారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Apsrtc, Rtc

    ఉత్తమ కథలు